టాలీవుడ్ పరువు తీసిన బాలయ్య

Balakrishna Smoking In Public

11:23 AM ON 19th April, 2016 By Mirchi Vilas

Balakrishna Smoking In Public

నందమూరి నట సింహం హిందూపూర్ ఎమ్మల్యే, హీరో నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నాడు . బహిరంగంగా ధూమపానం చేస్తూ వార్తల్లో నిలిచాడు . ఆదివారం చెన్నై వేదికగా ఎం.ఏ.చిదంబరం స్టేడియంలోజరిగిన నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కోసం పెట్టిన తారల క్రికెట్ టోర్నమెంట్ కి అతిధులుగా బాల కృష్ణ , వెంకటేష్ , రాజేంద్ర ప్రసాద్ వంటి వారు హాజారయ్యారు . ఆ సమయంలో పాత స్నేహితులు కలవడంతో బాలకృష్ణ తనను తాను మర్చి పోయాడు. తానో సెలబ్రెటీ మరియు ఎమ్మెల్యేను అనే విషయాన్ని పక్కకు పెట్టి మరో అక్కడ బరితెగించాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన టీ షర్ట్ తీసేసి మ్యాచ్ జరుగుతుండగా అందరి మధ్యలో కూర్చొని సిగరేట్ కాల్చడం వివాదాస్పదమైంది . పబ్లిక్ లో ఇలా సిగరెట్ కాల్చటం, అదీ ఓ సెలబ్రెటీ అయ్యి ఉండి కుడా , పక్కన వేరే తారలు ఉన్నా లెక్క చెయ్యకుండా దమ్ము కొట్టడం పలు విమర్శలకు దారితీస్తోంది. బాలయ్య ఇలా అందరి మధ్యలో స్మోకింగ్ చేసి టాలీవుడ్ పరువు తీసాడని కొందరు బాలయ్య పై ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

బాహుబలి రికార్డు బద్దలుకొట్టిన సరైనోడు

బాలయ్యకు నో చెప్పిన హీరోయిన్‌

జనతా గ్యారేజ్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా

English summary

Nandamuri Bala Krishna was recently attended with some of the celebrities to Nadigar Sangam Cricket Tournament which was held in Chennai on Sunday. In this Nandamuri Bala Krishna removes his shirt and Smoked in publicly. Due this so many people were fired on Bala Krishna was taking God Name of Tollywood.