రైతులకు అండగా నిలవనున్న బాలకృష్ణ

Balakrishna To Act As Farmer In His 100th Film

12:48 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Balakrishna To Act As Farmer In His 100th Film

నటసింహ నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్‌' వంటి ఘనవిజయం తరువాత నటించబోయే 100వ సినిమాకి ఎన్నో చర్చలు జరిగాయి. 100వ సినిమాకి డైరెక్టర్‌ ఎవరనేది రోజుకో డైరెక్టర్‌ మాట వినిపించేది. ఇప్పుడు ఆ వందో సినిమాకి సంబందించి పూర్తి విషయాలు బయటకి వచ్చాయి. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. దీనికి 'రైతు' అనే టైటిల్‌ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కధలో రైతులకి అండగా ఒక నాయకుడిగా బాలయ్య కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పూర్తి తెలుగు నేటివిటితో చిత్రీకరిస్తారట. పల్లెటూరి వాతావరణంలో పూర్తి ట్రెడిషనల్‌గా సినిమాలు తెరకెక్కించడంలో కృష్ణవంశీ దిట్ట. ఇందులో బాలకృష్ణ చాలా వరకు తక్కువ మేకప్‌తో రైతు గెటప్‌లో కనిపించనున్నారని సమాచారం. కృష్ణవంశీ ఈ చిత్రమే కాకుండా 'రుద్రాక్ష' అనే భారీ గ్రాఫిక్స్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

English summary

Balakrishna to act as a farmer in his 100th film.This movie was going to be directed by Krishna Vamsi and in this movie Balakrishna looks like a farmer with less make up.This movie was going to be shoot very traditionally according to Village Nativity.