వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’

Balakrishna To Act In Gautamiputra Satakarni Movie

05:19 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Balakrishna To Act In Gautamiputra Satakarni Movie

గత కొంతకాలంగా బాలకృష్ణ వందో సినిమాకి దర్శకుడు ఎవరన్న విషయంపై పెద్దఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. డిక్టేటర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా చాలా పేర్లు వినిపించాయి. చివరికి కృష్ణవంశీతో సినిమా ‘ఓకే’ అయిందని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనుకోకుండా క్రిష్‌ రేసులోకి వచ్చి,  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ పేరుతో క్రిష్‌ ఓ కథ తయారు చేసుకొన్నాడు.  క్రీ.పూ. ఒకటో శతాబ్ద కాలంలో, అమరావతి నేపథ్యంలో సాగే కథ ఇది. రాజదర్బార్‌లకు, యుద్ధ సన్నివేశాలకూ ప్రాధాన్యం ఉండడంతో  ఇలాంటి కథ కోసమే చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న బాలయ్య,  ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనా మక్కువ పెంచుకొన్నట్టు చెబుతున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథ, అందులోని తన పాత్ర బాలయ్యకు బాగా నచ్చాయట. ‘వెంటనే చేసేద్దాం...’ అంటూ క్రిష్‌కి పచ్చజెండా వూపినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా రావడం దాదాపుగా ఖాయమైపోయిందని జోరుగా వార్తలొస్తున్నాయి. .

1/4 Pages

అమావాస్య తర్వాత వందవ చిత్రం పై నిర్ణయం ...

    తన వందో చిత్రం కోసం రెండు కథలు సిద్ధమైనట్లు బాలకృష్ణ అంటున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’, క్రిష్‌ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథలు సిద్ధంగా ఉన్నాయని,  అయితే వీటిలో ఏది వందో సినిమాగా చేయాలన్న దానిపై అమావాస్య తర్వాత నిర్ణయం తీసుకుంటామ ని చెప్పారు.  ఎందుకంటే జాతకాలను బాగా నమ్మే బాలయ్య తిధి వార  నక్షత్ర బలం చూసి మరీ వందవ చిత్రం చేయాలని భావిస్తున్నాడు. 

English summary

After so many rumors Balakrsihna decided to act in Gautamiputra Satakarni Movie under the direction of Director Krish.Balakrishna was impressed with Krish story and Balayya decided to do movie with Krish.