క్రిష్ చేతిలో బాలయ్య 'యోధుడు'

Balakrishna To Act In Yodhudu

09:29 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Balakrishna To Act In Yodhudu

బాలయ్య వందో సినిమా ప్రకటనకు ముహూర్తం దగ్గర పడిందని అంటున్నారు. ఆమావాస్య వెళ్ళాక క్లారిటీ ఇస్తానని ఇప్పటికే బాలయ్య చెప్పడం, ఫాల్గుణ మాసం నడుస్తున్న నేపధ్యంలో ఇక నేడో, రేపో ప్రకటన రావచ్చని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇంతలోనే వందో సినిమాకు సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. . ‘కంచె’ తర్వాత వరుణ్‌ తేజ్‌ని ‘రాయబారి’గా చూపడానికి కసరత్తు చేస్తున్న దర్శకుడు క్రిష్ రూటు మార్చి , నందమూరి బాలయ్యతో జత కడుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో కనిపిస్తాడనే సంకేతాలు రావడం , దాదాపు ఈ సినిమా కు బాలయ్య ఒకే చెప్పేయడం అన్నీ పూర్తయినా ఇంకా అధికారిక. ప్రకటన వెలువడాల్సి వుంది. క్రిష్ , బాలయ్య కాంబినేషన్ లోనే వచ్చే వందో సినిమాకు డైలాగ్ వర్క్ కూడా మొదలైందట. క్రిష్ సినిమాలకి సంభాషణలు సమకూర్చే సాయి మాధవ్ బుర్రా ఈ బాధ్యత తలకెత్తుకున్నాదట. ఈ విషయంలో యమ బిజీ అయిపోయి, బాలయ్య కోసం మాటలు రాసేస్తున్నట్టు వినికిడి. ఇక ఈ సినిమా కోసం ‘యోధుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్న చెబుతున్నారు. బాలయ్య సినిమాల టైటిల్స్, పాత్రలు ఎంత పవర్ఫుల్‌గా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ టైటిల్ కూడా అలానే ఉంది. అందుకే ఈ టైటిల్ దాదాపు ‘ఖరారు’ చేసినట్లు కూడా తెలుస్తోంది. సంఖంలో పోస్తేకానీ తీర్ధం అవ్వదు కదా అందుకే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేస్తే సస్పెన్స్ వీడిపోతుంది ..

English summary

Tollywood Hero and Politician Nandamuri Balakrishna was getting ready for his 100th movie. Many news came on Balakrishna 100th movie but Balakrishna not yet responded on his 100th movie.Many directors came into news as the director of Balakrisha 100th movie but now a recent news that BalaKrishna was going to act in "Yodhudu" movie under the direction of Krish.Now this was the hot topic in Tollywood.