చిరంజీవికి పనికి రాని కథతో బాలయ్య 100వ సినిమా

Balakrishna To Act Under Krishna Vamsi Direction

12:35 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Balakrishna To Act Under Krishna Vamsi Direction

బాలకృష్ణ 99వ చిత్రం 'డిక్టేటర్‌' చిత్రం తరువాత బాలయ్య 100వ చిత్రానికి ఎటువంటి కధని ఎంచుకుంటాడు, ఎవరి దర్శకత్వంలో నటిస్తాడనే చర్చలు జోరుగా సాగాయి. అయితే ఈ ప్రశ్నలకి రెండు రోజులు క్రితం సమాధానం దొరికేసింది. ఈ చిత్రానికి క్రియేటీవ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి 'రైతు' అనే టైటిల్‌ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ రైతులకి నాయకుడిగా వాళ్లకి అండదండగా నిలిచే పాత్రలో బాలయ్య కనిపించనున్నాడట. అయితే ఈ చిత్రానికి సంబందించిన కథ గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అదేంటంటే కృష్ణవంశీ మెగాస్టార్‌ చిరంజీవి కి స్వతహాగా వీరాభిమాని. చిరు కోసం కృష్ణవంశీ గతంలో ఒక కథ రాసుకున్నాడట. అయితే ఆ కథ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఇదే కథని కొన్ని మార్పులు చేర్పులు చేసి బాలకృష్ణ తో కృష్ణవంశీ తెరకెక్కించనున్నట్లు తాజా సమాచారం.


బాలకృష్ణ 99 వ సినిమాగా సంక్రాంతి పండుగకు విడుదలై ఘన విజయం సాధించిన డిక్టేటర్ సినిమాలోని వీడియో సాంగ్స్ మీకోసం.

1/6 Pages

యువ కధానాయిక సోనాల్ చౌహాన్ తో "వాట్స్ అప్ బేబీ..వాట్స్ అప్ బేబీ..." హాట్ సాంగ్

English summary

Balakrishna was acted 99 movies till now and all were waiting to his 100th movie.Soo many rumours were coming on Balayya 100th movie but still now balayya not yet confirmed about his 100th movie.Recently a news that Balayya was going to act under Krishna Vamsi direction and that movie named as Raitu.Actually that story was written to Chiranjeevi by Krishna Vamsi.