బాలయ్యకు ఆస్కార్‌ వ(చ)చ్చి తీరుతుందట

Balakrishna told that i will get Oscar award for my 100th film

01:21 PM ON 23rd March, 2016 By Mirchi Vilas

Balakrishna told that i will get Oscar award for my 100th film

'డిక్టేటర్‌' విజయం తరువాత బాలకృష్ణ నటించే 100వ చిత్రం ఎవరితో రాబోతుందో, అసలు ఎవరి డైరెక్షన్‌లో రాబోతుందో అన్న ఆసక్తి బాలయ్య అభిమానుల్లో నెలకొన్న విషయం తెలిసిందే. అయితే దీనికి తెర దించుతూ బాలకృష్ణ తన వందో చిత్రం గురించి క్లారిటీ ఇచ్చాడు. తొలుత బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాసరావు, కృష్ణవంశీ అనే పేర్లు వినిపించినా బాలకృష్ణ క్రిష్‌ జాగర్లమూడి పైనే మొగ్గు చూపాడు. ఇటీవల తన మనవడు దేవాన్ష్‌ మొదటి పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన బాలయ్య తన 100వ చిత్రం గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే నా 100వ చిత్రంలో నాడు అమరావతి రాజధానిగా పరిపాలించిన శాతవాహనరాజు గౌతమీపుత్రుడు శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో నటించబోతున్నాను.

అందుకే మీసాలు కూడా పెంచుతున్నాను. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తారు. అంతే కాదు ఇందులో నా నటనకి జాతీయ అవార్డులు కాకుండా ఏకంగా ఆస్కార్‌ అవార్డు వస్తుందని చెప్పాడు. నాకొక ఆస్కార్‌, ఈ చిత్రానికి ఒక ఆస్కార్‌ వ(చ)చ్చి తీరుతుందని బాలయ్య నమ్మకం వ్యక్తం చేశాడు. ఇది ఎంతోమందికి నమ్మశక్యంగా లేకపోయినా తప్పదు అన్నట్టు విన్నారు.

English summary

Balakrishna told that i will get Oscar award for my 100th film. Iam acting as a Gouthamiputra Sathakarni in my 100th movie.