బాలయ్య తులాభారం

Balakrishna Visits Medaram Jatara

02:34 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Balakrishna Visits Medaram Jatara

ఏదేదో సినిమా స్టిల్ కాదు .. శ్రీ కృష్ణ తులాభారం సినిమా కాదు .... తెలంగాణాలోని మేడారం జాతరలో బాలయ్య తులాభారం ఇది. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వసుంధర దంపతులు మేడారం జాతరకు విచ్చేసి సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. తులాభారం వేయించుకున్నారు. మేడారం చేరుకున్న బాలయ్యకు అక్కడి వారు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే అరుదైన గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించడం శుభపరిణామమని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని సమ్మక్క-సారలమ్మను వేడుకున్నట్లు ఆయన తెలిపారు. మేడారం జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జాతరను రాష్ట్ర పండగగా గుర్తించామని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా గిరిజనుల పిల్లలకు ఉచిత విద్య, గురుకుల పాఠశాలల నిర్మాణం, జంపన్న వాగుపై వంతెన నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. ‘మాజీ ముఖ్యమంత్రి, తమ తండ్రి నందమూరి తారకరామారావు గారి పాలనలో ప్రజలకు సామాజిక న్యాయం అందింది. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని, భోగభాగ్యాలతో తులతూగాలని కోరకుంటున్నాను' అని బాలకృష్ణ అన్నారు.

English summary

TDP MLA and Actor Nandamuri Balakrishna has visited Medaram Sammakka Sarakka Jatara along with his wife and offered special prayers to goddesses. Speaking to media he said that it is happy to visit Medaram