బాలయ్య సిద్ధార్థ్ కి వార్నింగ్‌ ఎందుకిచ్చినట్టు?

Balakrishna Warning To Siddharth

06:38 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Balakrishna Warning To Siddharth

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో యూత్‌కి, ఫ్యామిలీ ప్రేక్షకులకి బాగా దగ్గరైన హీరో సిద్ధార్ధ్‌. ఈ చిత్రాల తరువాత సిద్ధూ నటించిన మరే చిత్రం అంతటి విజయాలు సాధించలేదు. దీనితో ఈ హీరో సరైన హిట్స్‌ లేక తమిళ ఇండస్ట్రీ వైపు వెళ్ళాడు. అయితే ఆ తరువాత నందిని రెడ్డి తెరకెక్కించిన 'జబర్ధస్త్‌' చిత్రంలో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఇంక తమిళ ఇండస్ట్రీలోనే ఉండిపోయాడు. అక్కడే సినిమాలు చేస్తూ తమిళంలోనే సెటిలైపోయాడు. దీనితో తెలుగు సినిమాలు చెయ్యడం లేదేంటి అని మీడియా ప్రశ్నించగా దానికి సిద్ధార్ధ్‌ అందరూ షాకయ్యేలా సమాధానం ఇచ్చాడు. అదేంటంటే తెలుగులో టాలెంట్‌ ఉన్న దర్శకులు లేరని, అలాగే మంచి కధలు కూడా లేవని సిద్ధూ తేల్చి చెప్పేశాడు. ఈ మాటల్ని విన్న తెలుగు దర్శకులు సిద్ధూ పై మండి పడ్డారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాలకృష్ణ డైరెక్టగా సిద్ధార్ధ్‌కి ఫోన్‌ చేసి సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చాడట. ఇంకెప్పుడు తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడొద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చాడట.

English summary

Nandamuri Bala Krishna Warned Hero Siddharth for doing controversial comments on telugu film industry.Siddharth said in an interview that there were no talented directors in Telugu Film industry.Soo many people industry were opposed his words and recently Balakrishna warned Siddharth.