నాని డ్యాన్స్‌కి బాలయ్య విజిల్‌

Balakrishna Whistle For Nani Dance

03:32 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Balakrishna Whistle For Nani Dance

నందమూరి నటసింహ బాలకృష్ణ ధియేటర్‌లో స్క్రీన్‌ పైకి వచ్చేసరికి ఆయన అభిమానులు విజిల్స్‌, క్లాప్స్‌ కొట్టి కేరింతలు కొడతారు. అంతేకాదు కాగితాలను ముక్కలుగా చింపి గాల్లోకి ఎగురవేస్తారు. బాలయ్య పంచ్‌ డైలాగ్‌లు చెప్పుతుంటే మాస్‌ ప్రేక్షకులు ఒకటే విజిల్స్‌ వేస్తారు. అలాంటి బాలయ్య చిన్న హీరో అయిన నాని పాటకి విజిల్‌ వేశాడట. వివరాల్లోకెళితే నాని కెరీర్‌ ఆరంభంలో 'రైడ్‌' అనే చిత్రంలో నటించాడు. అందులో బాలకృష్ణ సూపర్‌హిట్‌ చిత్రం 'మంగమ్మ గారి మనవడు' చిత్రంలో పెద్దహిట్‌ అయిన 'దంచవే మేనత్త కూతురా' అనే పాటను రీమేక్స్‌ చేశారు. దీనితో బాలయ్యని, కొంత మంది రాజకీయ నాయకుల్ని 'ఐమాక్స్‌'లో స్పెషల్‌ షో వేసి నాని, ఆ చిత్ర డైరెక్టర్‌ రమేష్‌ వర్మ వాళ్ళని పిలిచారట. ఈ పాటలో నాని డ్యాన్స్‌ నచ్చడంతో బాలకృష్ణ విజిల్‌ కూడా వేశారట. ఈ విషయాన్ని నాని స్వయంగా వెల్లడించాడు. నాని తాజాగా నటించిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాథ' చిత్రంలో బాలయ్యకి వీరాభిమానిగా నటించిన విషయం తెలిసిందే.

English summary

Tollywood Top Hero Nandamuri Balakrishna was whistled by seeing young Hero Nasni's dance in the theater.In past Nani acted as hero in Ride movie and Nani and the movie unit welcomed BalaKrishna to a special show and he whistles at Nani dance.Recently Nani acted as BalaKrishna Fan in his recent film "Krishna Gqadi Veera Prema Gadha"