డిసెంబర్‌ 20న డిక్టేటర్‌ ఆడియో

Balakrishna's Dictator Movie Audio On 20th December

06:09 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Balakrishna's Dictator Movie Audio On 20th December

గోపీచంద్‌తో లక్ష్యం వంటి భారీ హిట్‌ తరువాత ఇటీవలే మళ్ళీ గోపీచంద్‌తో లౌక్యంతో హిట్‌ కొట్టిన దర్శకుడు శ్రీవాస్‌ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో డిక్టేటర్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ అయిన ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్ర ఆడియో డిసెంబర్‌ 20న నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అయిన అమరావతిలో అంగరంగ వైభవంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచశాంతి దూత గౌతమబుద్దుడు నడయాడిన నేలగా అమరావతిని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ అమరావతిలో జరుగుతున్న తొలి తెలుగు సంగీత విడుదల వేడుక డిక్టేకర్‌ అని దర్శకుడు శ్రీవాస్‌ తెలిపారు. లెజెండ్‌ భారీ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన బాలయ్యబాబును ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారో అలా ఈ డిక్టేటర్‌లో చూపించబోతున్నారట. మంచి స్టైలిష్‌ లుక్‌తో బాలయ్య ఇందులో కనిపిస్తారు. సంక్రాంతి పండుగకి ఈ సినిమా ఒక పండుగలా నిలిచిపోతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

English summary

Balakrishna’s next movie Dictator movie is releasing on Jan 16 and Audio will be releasing on December 20, It is jointly produced by Eros International and Sriwass under Vedhaaswa Creations banner releasing under the direction of Sriwass