‘గౌతమీపుత్ర శాతకర్ణి’ఆహ్వాన పత్రిక

Balakrishnas Gowthami Putra Satakarni Movie Invitation

06:59 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Balakrishnas Gowthami Putra Satakarni Movie Invitation

సినిమా అంటేనే బోల్డన్ని హంగులు ... అందునా స్పెషల్ ఎట్రాక్షన్ వుంటే ఇక చెప్పక్కర్లేదు.. దాని హడావిడి ... దాని దాలుకు కిక్కు వేరు ... బాలయ్య వందో సినిమా కోసం బ్రహ్మాండ మైన ఇన్విటేషన్ రూపుదిద్దుకుంది. సాక్షాత్తూ రాజరాజ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గారి ఆహ్వానం అంటూ ఈ ఆహ్వాన పత్రిక అలరిస్తోంది. ముహూర్తం శుక్రవారం ఉదయం గం.10.27ని.లకి. స్థలం అన్నపూర్ణా స్టూడియోలో.

ఇవి కూడా చదవండి: ఇక శ్రీవారి దర్శనం గంటలోనే

శ్రీబసవరామ తారకపుత్ర నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం అంజనాపుత్ర రాధాకృష్ణ(క్రిష్‌) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్నన నేపధ్యంలో దీనికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌రెడ్డి, శ్రీనివాస్‌, సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేయడం కూడా తెల్సిందే. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం(22-04-2016) ఉదయం 10:27 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్న కారణంగా, ఈ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ చిత్ర బృందం విభిన్నమైన ఆహ్వానపత్రికను పంపిణీ చేసింది. స్వయంగా గౌతమి పుత్ర శాతకర్ణి ఆహ్వానిస్తున్నట్లుగా దీనిని ముద్రించారు. చిత్ర బృందం పేర్లన్నిటికీ కూడా శాతకర్ణి పేరులాగా తల్లి పేరు చేర్చి ముద్రించిన ఈ ఆహ్వానపత్రిక ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి:సన్నీ లియోన్ కండోమ్ యాడ్ క్యాలెండర్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, చిత్రపరిశ్రమ ప్రముఖులకు, పాత్రికేయులు తదితరులకు ఈ ఆహ్వానపత్రి కలు అందించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల సిఎమ్ ల నడుమ 'గౌతమి పుత్ర శాతకర్ణి' కి ముహూర్తపు షాట్ రెడీ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

సన్నీ లియోన్ కండోమ్ యాడ్ క్యాలెండర్ విడుదల

650 మందితో సెక్స్ చేసిన క్రికెటర్

యాంకర్ ప్రశ్నకు షాక్ తిన్న బాలయ్య(వీడియో)

English summary

Here is the invitation of Balakrishnas Gowthami Putra Satakarni Movie Invitation. BalaKrishna invited Chandra Babu Naidu,KCR and few other Celebrities to this movie launch event.