బోయపాటి తో బాలయ్య సినిమా రెడీ 

Balayya 100th Film Updates

10:09 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Balayya 100th Film Updates

సింహా లాంటి హిట్ తో బాలయ్య రేంజి పెంచేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మరో స్క్రిప్ట్ తో రెడీ అవుతున్నాడు. ఈ ఏడాదే ఈ సినిమా వుంటుంది . డిక్టేటర్ హిట్ తో హుషారు గా వున్న బాలయ్య ఇక నుంచి ఏటా 3నుంచ 4 సినిమాలు చేస్తాడట. రాజకీయాల్లో చేరి , హిందూపురం ఎంఎల్ఎ గా ఎన్నికైన బాలయ్య అటు రాజకీయాల్లో ,ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా హాస్పిటల్ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ సినిమాలు తగ్గించాడు. అయితే డిక్టేటర్ ఇచ్చిన హిట్ టాక్ బాలయ్యకు టానిక్ గా పనిచేసింది. పైగా కుర్ర హీరోలకు దీటుగా స్టెప్పులు వేసి హుషారెత్తించిన బాలయ్య కు మంచి రెస్పాన్స్ రావడంతో ఫాన్స్ ని సంతోష పెట్టాలని మళ్ళీ సినిమాల్లో జోరు పెంచుతున్నాడు.

వందో సినిమా వారం రోజుల్లోనే మొదలవుతుందన్న సంకేతాలు ఇచ్చిన బాలయ్య దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇస్తానని అంటున్నాడు. ఆదిత్య 369 తీసిన సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లోనే వందో సినిమా వస్తుందని, చిత్రం పేరు కూడా ఆదిత్య 999 గా చెబుతున్నారు. ఇందులో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటించాడు. మరోపక్క బోయపాటితో సినిమా కు రెడీ అవుతున్నాడు. అయితే సింగీతం శ్రీనివాసరావు తో ముందు మొదలవుతుందా, బోయపాటి తో మొదలవుతుందా అనే విషయం కూడా క్లారిటీ ఇస్తానని అంటున్నాడు. ఏది ఏమైనా వందో చిత్రం మాత్రం సింగీతంతోనేనని ఘంటా పదంగా చెబుతున్నాడు. వందో సినిమాపై భారీ అంచనాలు వున్నట్టుగానే ఇక బోయపాటి సినిమా అంటే కూడా మరింత భారీ గా ఉంటుందని చెప్పవచ్చు.

English summary

Nandamuri Balakrishna was enjoying the success of his 99 th film Dictator and he is getting ready to do 100th film as soon as early.Recently a news came that he is going to act under the direction of Singeetham Srinivas and now anther director came into news that boyapati srinu was also getting ready to do balayya's 100th film.Balakrishna says that he will give clarity within a week