డిక్టేటర్లో శక్తి ఉందంటున్న బాలయ్య

Balayya About Dictator Movie

09:47 AM ON 19th January, 2016 By Mirchi Vilas

Balayya About  Dictator Movie

‘‘డిక్టేటర్‌’ పేరులోనే ఓ శక్తి ఉందా? వుందని చిత్ర హీరో నందమూరి బాలయ్య అంటున్నాడు. అంతేకాదు ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం గురించి భారతదేశం యావత్తూ మాట్లాడుకుంటోంది. నాకు తండ్రి గురువు దైవం, అన్నీ నాన్నగారే. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడానికి ఆయనే స్ఫూర్తి’’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎక్కడంటే, సోమవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో...

నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన 99వ చిత్రం ‘డిక్టేటర్‌' కి . శ్రీవాస్‌ దర్శకత్వం వహించారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలు గా నటించిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందు కొచ్చి, బ్లాక్ బస్టర్ అయిన నేపధ్యంలో నిర్వహించిన విజయోత్సవంలో బాలకృష్ణ మాట్లాడాడు. 'కోట్లాది తెలుగువాళ్లు ఈ సినిమా గురించి ఆసక్తిగా చర్చించుకొంటున్నారు. అన్ని తానై ఈ సినిమా తీశాడు దర్శకుడు శ్రీవాస్‌. సెట్లో కుటుంబ వాతావరణం కనిపించింది. ‘బాజీరావ్‌ మస్తానీ’ లాంటి గొప్ప చిత్రం తెరకెక్కించిన ఎరోస్‌ సంస్థ తెలుగులో ‘డిక్టేటర్‌’తోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆనందాన్ని కలిగించింది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఆశయంతో అహర్నిశలూ పనిచేశాం. ఈ సినిమాలో నేను కొత్తగా కుర్రాడిలా కనిపిస్తున్నానంటుంటే చాలా ఆనందంగా ఉంది' అని బాలయ్య సంబరపడ్డాడు.

ఎన్నో ఏళ్ళ తర్వాత రతి అగ్నిహోత్రితో నటించా....

' రతి అగ్నిహోత్రితో ఎన్నో ఏళ్ల కిందట కలసి నటించా. మళ్లీ ఈ సినిమా ద్వారా ఆమెని కలుసుకోవడం ఆనందంగా ఉంది' అని బాలయ్య అన్నాడు. ఇక తమన్‌ సంగీతం బాగుందని మెచ్చుకున్నాడు. దర్శకుడు శ్రీవాస్‌, హీరో సుమన్, గౌతంరాజు, శ్యామ్‌.కె నాయుడు, శ్రీధర్‌ సీపాన, భాస్కరభట్ల, రఘుబాబు, రాజీవ్‌ కనకాల, బెనర్జీ, కాశీవిశ్వనాథ్‌, జీవీ, గిరి, గుండు సుదర్శన్‌, అశోక్‌కుమార్‌, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

English summary

Balayya's Dictator Movie which was released for Sankranthi Festival Was Become Super Hit At Box Office. BalaKrishna says that he was very happy for the success of the movie and he praised Music Director S.S.Thamman,Director SriVaas,And many more