బోయపాటి పై బాలయ్య ఫైర్

Balayya Angry On Boyapati Srinu

03:14 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Balayya Angry On Boyapati Srinu

అవునా , ఎందుకు బోయపాటి శ్రీను అంటే బాలయ్యకు కోపం ... పైగా దాదాపు దశాబ్దం పాటు సరైన హిట్ లు లేక ఇబ్బందుల్లో వున్న నేపధ్యంలో బాలకృష్ణ కి సరైన టైం లో సింహా తో అందలం ఎక్కించిన బోయపాటి శ్రీను ఆ తర్వాత లెజెండ్ కూడా హిట్ ఇచ్చాడు. మరి అతని పై బాలయ్య ఎందుకు గుర్రుగా వున్నాడు. ఇద్దరి మధ్యా అంత రాద్ధాంతం ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే,

ఈ మధ్య డైరెక్టర్ శ్రీవాస్ తీసిన డిక్టేటర్ సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయ్యింది. సక్సెస్ టూర్ కూడా చేసిన బాలయ్య మంచి జోష్ మీదున్నాడు. 99వ చిత్రమే ఇంతిలా వుంటే, ఇక 100 వ చిత్రం మీద సహజంగానే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పదిపోయాయి. అది కూడా యాక్షన్ చిత్రం అయి వుండాలని సగటు నందమూరి అభిమాని బలంగా కోరుకోవడంతో, బోయపాటిని సంప్రదించినట్లు వినికిడి. అయితే ఏడాది క్రితం బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా కి అగ్రిమెంట్ జరిగిందట. ప్రస్తుతం అల్లు అర్జున్ 'సరైనోడు' కోసమే టైం ఇచ్చిన బెల్లంకొండ ఇక తాను ఎట్టి పరిస్థితిలో ఆగేది లేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో గత్యంతరం లేక ఒప్పుకున్న మేరకు బోయపాటి ఆ సినిమా చెయ్యాల్సి ఒస్తోందట. ఇక లక్ష్మీ నరసింహ సినిమా తో ఏర్పడ్డ విబేదాల పుణ్యమా అని బెల్లంకొండకీ , బాలయ్య కీ అంతగా అత్తిపొత్తులు లేవు. దీంతో బాలయ్య 100 వ సినిమా చేయలేనని బోయపాటి చెప్పడంతో, సిగీతం శ్రీనివాసరావు తో తీయాలని భావించి , ఆమేరకు బాలయ్య 100వ చిత్రంగా ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమా చేస్తున్నట్లు ప్రకటించేసాడు.

అయితే అభిమానులకోసం భారీ యాక్షన్ చిత్రమే చేయాలని వత్తిడి పెరగడంతో, బోయపాటిని ఇంకోసారి సంప్రదించినా సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో బాలయ్య సరే ఏం చేస్తాం అంటూ నిట్టూర్చాడట. ఇక బాలయ్యకు బోయపాటి కోపం వచ్చేసినట్టుందని టాక్ నడుస్తోంది. చివరి వరకూ ప్రయత్నం చేస్తే ఫలితం దక్కవచ్చన్న భావనతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు వినికిడి. అందుకే బాలయ్య 100వ సినిమాకి క్రిష్ తదితర డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. ఏది ఏమైనా ఇప్పటివరకు బాలయ్య 100వ సినిమాపై క్లారిటీ రాలేదు. చివరకు ఏదైనా జరగవచ్చు

English summary

Director Boyapati Srinu was busy with his forth coming Film Sarainodu with Allu Arjun.Later He was goping to make film with Bellamkonda Srinivas.Boyapati Srinu got fame to Balakrishna with his Simha and Legend Movies.A news came to know that Balakrishna asked Boyapati Srinu to direct his 100th film but Boyapati srinu rejected that for that he had already committed the movie with Bellamkonda Srinivas.Due to this Balakrishna got angry on Boyapati Srinu.