డిక్టేటర్ రికార్డు క్రియేట్ చేస్తుందా 

Balayya Dictator Audio Released

01:16 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Balayya Dictator Audio Released

నందమూరి హీరో బాలకృష్ణ 99వ మూవీ ‘డిక్టేటర్’ రికార్డు క్రియేట్ చేస్తుందని ఆభిమానులు చెబుతున్నారు. రాజధాని లో తొలిసారి ఆడియో లాంచింగ్ జరిగిన ఈ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పుతుందని అంటున్నారు. గతంలో లక్ష్యం , శౌర్యం , రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాలకు దర్సకత్వం వహించిన శ్రీవాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన డిక్టేటర్ ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం ఘనంగా నిర్వహించిన సంగతి తెల్సిందే.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయిన ఈ కార్యక్రమంలో ఫస్ట్ సీడీని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆవిష్కరించి హీరో బాలకృష్ణకు అందించారు. ‘డిక్టేటర్‌’ అద్భుత విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. .ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ.డైలాగులతో అలరించారు. 'నేనెప్పుడూ కాలం వెంట వెళ్లను.. కాలం నా వెంట రావాల్సిందే' తన క్యారెక్టర్‌కి తగిన టైటిల్ ‘డిక్టేటర్’ అని చెప్పుకొచ్చారు. ‘సింహం కూడా దాహం వేస్తే తలదించుకుని నీళ్లు తాగుతుంది.. అంత మాత్రాన అది తలదించుకుందని తొడగొట్టకు. ఆతర్వాత కొట్టడానికి తొడ వుండదు - ఎత్తడానికి తల వుండదు.' ' మీరు ఏం చేసినా పబ్లిసిటీ చేస్తారు. నేనేం చేసినా పబ్లిసిటీ అవుతుంది' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌కు ఆడియన్స్ నుంచి కరతాళ ధ్వనులతో రెస్పాన్స్!

అభిమానులు ఏమీ ఆశించికుండా ఆదరిస్తున్న తీరు ఆనందంగా ఉందని.. ఆనాడు తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇలాగే అండగా నిలిచారని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

English summary

Nandamuri Bala Krishna's 99 th film " Dictator " movie audio released in Andhra Pradesh New Capital Amareavathi. This film was directed by Sri Vaas.