వందో చిత్రంలో కూడా అదే చేస్తున్నాడట

Balayya Dual Role In His 100th Movie

11:31 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Balayya Dual Role In His 100th Movie

నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రానికి దర్శకుడిగా సడన్‌గా క్రియేటీవ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బాలయ్య తన వందో సినిమాకి కృష్ణవంశీని డైరెక్టర్‌ గా కన్ఫార్మ్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య తన గత రెండు చిత్రాల్లో చేసిందే మళ్లీ చేస్తున్నాడట. చాలా కాలం తరువాత బాలయ్య 'సింహ' చిత్రంతో ఘన విజయం అందుకున్నాడు. అందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. మళ్లీ 2014 లో 'లెజెండ్‌' చిత్రంలో కూడా ద్విపాత్రాభినయం చేశాడు. అది కూడా ఘన విజయం సాధించడంతో బాలయ్య మళ్లీ తన 100 వ సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. ఇది హిస్టారికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో తెరకెక్కనుండడంతో ఇందులో కచ్చితంగా ద్విపాత్రాభినయం చెయ్యాలట.

English summary

MLA and Cinema Hero Nandamuri Bala Krishna was acted in 99 movies upto now and all were waiting eagerly for his 100th movie.Soo many directors came into news for Balakrishna 1ooth movie and still now Balayya didnot made any Statement on his 100th movie.Now a news came to know that he was going act in dual roles in his 100th film.