అదొక్కటే  చేతకాదని ఒప్పుకున్న బాలయ్య

Balayya Revealed His Secrets

09:50 AM ON 21st January, 2016 By Mirchi Vilas

Balayya Revealed His Secrets

ఈ సంక్రాంతి కి విడుదలైన డిక్టేటర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఫుల్ జోష్ మీదున్న బాలయ్య టివి చానెల్స్ ఇంటర్యూ లలో యమ సరదాగా ఉంటున్నాడు. కుర్ర హీరోల మాదిరిగా సరదా కబుర్లు చెప్పడంతో పాటూ అన్ని విషయాలు విడమరిచి చెబుతున్నాడు. బుధవారం రాత్రి ఓ చానల్ లో డిక్టేటర్ తో చిట్ చాట్ కార్యక్రమంలో బాలయ్య బోల్డన్ని కబుర్లు పంచుకున్నాడు.

'పలానా పాత్ర పోషిస్తున్నప్పుడు అందులో పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయాలి. ఇది నాన్న గారి నుంచి నేర్చుకున్నాను. దేవుడు పాటలో నటించినా , దేవుడు పాత్ర పోషించినా చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఇక నిజ జీవితంలో అయితే కుటుంబంలో , బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , హిందూపురం ఎంఎల్ఎ గా ఎలా నడుచుకోవాలో అలా చేస్తాను. అయితే నిజ జీవితంలో నటించడం చేతకాదు. అదొక్కటి చేతకాదని ఒప్పుకుంటున్నాను' అని బాలయ్య వివరించారు.

English summary

Nandamuri Bala Krishna was enjoying the success of Dictator Movie. He gave an interview to one news channel in that he says that he will do 100 percent of his best when he was doing different different roles