రోజుకో చుట్ట బలం అంటున్న బాలయ్య

Balayya smoke daily a Cigar

04:36 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Balayya smoke daily a Cigar

అప్పట్లో వచ్చిన 'టాప్‌హీరో' సినిమాలో నందమూరి బాలకృష్ణ బీడీలు తాగండి బాబులూ తాగి స్వర్గాన్ని చూడండి బాబులూ అని ఒక ఉపదేశం ఇచ్చారు. సినమా లోనే కాదు బయట కూడా పొగతాగడం మంచిదే అని చెప్పుకొచ్చారు. బాలయ్య రోజూ ఉదయం ఒక చుట్ట కాలుస్తారట. అది ఆరోగ్యం కోసమే అని బాలయ్య సెలవిచ్చారు. పురాణాలలో విషయాలని చర్చిస్తూ పొగతాగడం వల్ల లాభం గురించి ఓ ప్రోగ్రామ్‌లో బాలయ్య తెలిపారు.

అమృతం చుక్క భూమి మీద పడి పొగాకు చెట్టుగా పుట్టిందని...పొగతాగని వాడు మరు జన్మలో దున్నపోతై పుడతాడని పురాణాలు చెప్తున్నాయని బాలయ్య ఒక పద్యం వివరించాడు. నేను ఉదయం లేవగానే ఒక చుట్ట కాలుస్తా అది గొంతుకి, ఆరోగ్యానికి మంచిది అని బాలయ్య అన్నాడు. అదేంటి మీరు చుట్ట కాలుస్తారా ? అని జనాలు అడుగుతుంటారని బాలయ్య చెప్తూ మరో పద్యం అందుకున్నాడు.

పొగ తాగని కారణంగానే ధ్రుతరాష్ట్రుడి కళ్ళు పోయాయని, పొగపై నిషేధం విధించడం వల్లే దశరధుడు పుత్రశోకం అనుభవించాడని, పొగాకు దూరం చేయడం వల్లే పాండురాజు పాండు రోగం తెచ్చుకున్నాడని, శ్రీకృష్ణుడు జరాసంధుడిని కోల్పోవడానికి కూడా కారణం పొగాకు అని పద్యరూపంలో చెప్పాడు బాలయ్య. మొత్తానికి చుట్ట తాగడం మంచిదని బాలయ్య స్పష్టం చేసారు. ప్రభుత్వాలు పొగతాగడం నేరం అంటుంటే పొగ తాగడం గురించి పాజిటివ్‌ స్వీచ్‌ ఇవ్వడం విశేషమే.

English summary

Balayya seems to be implementing his screen advice in his real life.