కేసీఆర్ కు బాలయ్య ధన్యవాదాలు

Balayya thanks to telangana CM Kcr

11:18 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Balayya thanks to telangana CM Kcr

టీడీపీ, టి ఆర్ ఎస్ ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం కి నందమూరి నటసింహం , హిందూపురం ఎం ఎల్ ఏ బాలయ్య ధన్యవాదాలు చెప్పేసారు. అయితే దీని వెనుక ఏ రాజకీయ కోణం లేనేలేదు. ఎందుకంటే, తెలంగాణా ప్రభుత్వానికి తమ ఆసుపత్రి చెల్లించాల్సిన రాయల్టీని మాఫీ చేసిన తెలంగాణా సిఎం కెసిఆర్ కి సినీ నటుడు, బసవతారకం ఇండో-అమెరికన్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ కృతఙ్ఞతలు తెలిపారు. బుధవారం ఆసుపత్రి 16 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య కేక్ కట్ చేశారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పరోక్షంగా ఇలా సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులను సత్కరించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చూడండి: కడుపులో బిడ్డ ఎందుకుతంతాడో తెలుసా ?

ఇది కూడా చూడండి: వంటింటి చిట్కాలు

ఇది కూడా చూడండి: సోయా పాలలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

English summary

Balakrishna Participated on the occasion of the 16th anniversary and Balayya thanks to telangana CM Kcr.