ఆ యాప్ ను నిషేధించాలంట ....

Ban On Blind Spot App

10:13 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Ban On Blind Spot App

అక్కడి రాజకీయ నేతలు పత్రికలకో మీడియాకో కాదు ఓ యాప్ కి భయపడి చస్తున్నారు. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియా, యాప్ బాగా డవలప్ అవ్వడంతో ఏ క్షణాన ఏ కొంప మునుగుతుందోనని రాజకీయ నేతలు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇంతకీ సంగతేమంటే, ఇజ్రాయిల్‌లో నెల రోజుల క్రితం బ్లైండ్‌ స్పాట్ పేరుతో విలియం, నిక్కీ మినాజ్ అనే ఇద్దరు వ్యాపారవేత్తలు ఓ యాప్‌ను ఆవిష్కరించారు. ఇది అలాంటి ఇలాంటి యాప్ కాదండోయ్. ఈ యాప్ పేరుకు తగ్గట్టుగానే గుడ్డిగా ఉంటుంది. ఈ యాప్ సహాయంతో తెలియని వ్యక్తులకు ఎవరికైనా సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపిచొచ్చు.అయితే వచ్చిన చిక్కల్లా, ఎక్కడ నుంచి సందేశాలు పంపించారో ట్రేస్ అవుట్ చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదట. ఇంత కీలకమైన ఈ యాప్‌ను ఇప్పటివరకూ లక్షల మంది డౌన్‌లోడ్ చేసేసుకున్నారు. దీనిని ఉపయోగించుకుని సంఘవిద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి.

ముఖ్యంగా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల నుంచి బెదిరింపు సందేశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయంభయంగా గడుపుతున్నారు. ఈ యాప్‌ను ఇజ్రాయిల్ పార్లమెంట్ కమిటీ తీవ్రంగా విమర్శించింది. ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని రాజకీయ నాయకులంతా గళం విప్పుతున్నారు.

ఇక కొందరు సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా యువతులకు అసభ్యకర రీతిలో సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అంతేకాదు అమ్మాయిల నగ్న భంగిమలతో కూడిన చిత్రాలు పంపిస్తూ కొందరు యువకులు పైశాచికానందాన్ని పొందుతున్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు యువతులు లోలోపల కుమిలిపోతుంటే, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారట. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా అవకాశం లేదు.

ఎందుకంటే ఎవరు పంపించారో ట్రేస్ అవుట్ చేయడం సాధ్యం కాదు కదా. మరి ఇజ్రాయిల్‌లో కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది. అలాంటి చోటే ఇలాంటి యాప్ ఉపయోగిస్తున్నారంటే, ఇండియాలో ఇలాంటి పోకడలు మొదలైతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఒక అన్‌నోన్ మెసెంజింగ్ సర్వీస్. అందుకే తయ్యారు చేసిన వారి మెడకు ఉరితాడులా ఈ యాప్ మారిందట. మరి తొందరోలోనే ఈ యాప్ కి మంగళం పాడేస్తా రనడంలో సందేహం లేదు.

English summary

A new app named blind spot app. With the use of this app we can send messages , photos,videos to another people.The main feature of this app was that the receiver does not get information of the sender.