హెల్తీ  అరటిపండు మరియు కొబ్బరి కేక్‌

Banana and coconut cake

04:44 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Banana and coconut cake

రాబోయే క్రిస్మస్ వేడుకలలో ఏం స్పెషల్‌ వంటకాలు చేస్తున్నారు ? పండగలప్పుడు రుచికరమైన వంటకాలు చేసుకుని, డైట్‌ పక్కన పెట్టి పుల్‌గా లాగించేస్తూ ఉంటాం. అదే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అనుకోండి. ఒక్క దెబ్బకి రెండు పిట్లలు దొరికినట్లే కదా....బరువు పెరగకుండా హ్యాపీగా కడుపునిండా తినేయొచ్చు. కేక్‌లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది కదూ..కాని కేక్‌లు అధికంగా తినడం వలన బరువు పెరుగుతారు. కాని ఈ కేక్‌ ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అదే అరటిపండు మరియు కొబ్బరి కేక్‌. ఈసారి క్రిస్మస్ కి ఈ రెసిపీ ని తయారు చేసుకోండి అందరితో ఉల్లాసంగా ఎంజాయ్‌ చేస్తూ పండుగ రోజుని గడపండి. ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.

తయారు చేయడానికి కావలసినవి :

 • గోధుమపిండి - 1 కప్పు
 • బేకింగ్‌ సోడా - 1/2 టీస్పూన్‌
 • బేకింగ్‌ పౌడర్‌ - 2 టీస్పూన్స్‌
 • దాల్చినచెక్క పొడి - 1 టీస్పూన్‌
 • ఉప్పు - 1/4 టీస్పూన్‌
 • బెల్లం పొడి - 3/4 కప్పు
 • గుడ్లు -2
 • వెన్న - 2 టీస్పూన్స్‌
 • పసుపు రంగు అరటిపళ్ళు - 3
 • వాల్నట్‌ తరిగినవి - 1/2 కప్పు
 • ఎండు కొబ్బరి - 3/4 కప్పు.

తయారు చేయు పద్ధతి :

 • ముందుగా గోధుమ పిండి ని తీసుకుని దానిలో తగినంత ఉప్పుకలపుకోవాలి.
 • తరువాత దానిలో బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌ మరియు దాల్చిన చెక్క వేయాలి.
 • ఆ తరువాత వెన్న మరియు బెల్లం వేరొక పాత్రలో తీసుకుని కలపాలి. ఇప్పుడు గుడ్డుని పగలగొట్టి వెన్న మరియు బెల్లం కలపాలి. వెనీలా ఎసెన్స్‌ని కూడా వేసి బాగా కలపాలి.
 • ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా కలిపిపెట్టుకున్న గోధుమపిండి, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చినచెక్క మిశ్రమాన్ని ఈ మిశ్రమంలో నెమ్మదిగా వేస్తూ బాగా కలపాలి.
 • ఇప్పుడు అరటిపండు గుజ్జుని ఈ మిశ్రమంతో కలపాలి.
 • అదే విధంగా ఎండుకొబ్బరి తురుము ను కూడా వేయాలి.
 • మైక్రోవేవ్‌ సేఫ్‌ డిష్‌ని తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేయాలి.
 • తరువాత తరిగిన వాల్‌నట్‌ ముక్కలను పైన చల్లాలి.
 • దీనిని 50 శాతం పవర్‌తో 15 నిమిషాలు పాటు తరువాత 100 శాతం పవర్‌ తో 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
 • తరువాత బాగా ఉడికిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు టూత్‌పిక్‌ తో టెస్ట్‌ చేయాలి.
 • తరువాత చల్లారనిచ్చి సర్వ్‌ చేసుకోవాలి.
 • చూసారు కదా సులభమైన ఆరోగ్యకరమైన హెల్తీ రెసిపీ తయారీ విధానాన్ని.

English summary

This will surely be a hit at your Christmas party. This banana coconut cake most healthy recipe.try this once at home. Sure you like this healthy cake.