మోడీకి  గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్న బెనారస్ యూనివర్సిటీ

Banaras University To Give Doctorate To Modi

03:10 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Banaras University To Give Doctorate To Modi

ఓ పక్క ప్రపంచ దేశాలు చుట్టి వస్తూ పలు మార్పులకు కారనమవుతూ , మరో పక్క ప్రజాసేవ, ప్రభుత్వ పాలనలో దేశానికి చేస్తున్న నిరుపమాన సేవలకు గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడానికి దేశంలోని ప్రఖ్యాత బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) ప్రతిపాదించింది. త్వరలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ నూరవ స్నాతకోత్సవానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కానున్న సందర్భంగా డాక్టరేట్‌తో సత్కరించడానికి ప్రతిపాదించినట్లు బీహెచ్‌యూ ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 22న నిర్వహించనున్న విశ్వవిద్యాలయం నూరవ స్నాతకోత్సవానికి ప్రధాని మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా మోడీ స్నాతకోత్సవ సందేశం ఇస్తారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనేక విద్యావిషయక, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అదేరోజు ప్రధాని ఇక్కడి సీర్‌ గోవర్థన్‌ ప్రాంతంలోని రవిదాస్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడికి వచ్చే ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తారని తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ బిజెపి మీడియా ఇన్‌ఛార్జి సంజయ్‌ భరద్వాజ్‌ తెలిపారు. రవిదాస్‌ జయంతి సందర్భంగా పంజాబ్‌, తదితర రాష్ట్రాలనుంచి లక్షకుపైగా భక్తులు ఆలయానికి తరలి వస్తారని తెలిపారు. కాగా వారణాసి నుంచి మోడీ లోకసభకు ప్రాతినిద్యం వహిస్తున్న సంగతి తెల్సిందే.

English summary

Banaras Hindu University (BHU) decided to felicitate Indian Prime Minister Narendra Modi with the degree of Doctor of Law for good governance and public service at its centenary convocation which is scheduled to be held on February 22