టెంపరేచర్ చూస్తుంది.. మందులిస్తుంది..

Bandage That Senses Temperature

04:32 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Bandage That Senses Temperature

శరీరంపై టెంపరేచర్లను గుర్తించి అందుకు అనుగుణంగా మందులు ఇచ్చే కొత్త బ్యాండ్ ఎయిడ్ కు రూపకల్పన చేసింది అమెరికా పరిశోధకుల బృందం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దీనిని రూపొందించింది. సాధారణంగా మనం గాయాలపై వాడే బ్యాండ్ ఎయిడ్ ద్వారానే అవసరమైన మందులు తీసుకునే సదుపాయం కల్పించడం కోసం ఈ టీమ్ కృషి చేస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే మనం నోటి ద్వారా మందులు వేసుకోనవసరం లేదు. ఇంజక్షన్ల‌ను కూడా పరిమితం చేయవచ్చు. శరీరానికి అంటిపెట్టుకుని ఉండే ఈ బ్యాండ్ ఎయిడ్ లో ఉష్ణోగ్రత ను పసిగట్టే పరికరాలను అమర్చి ఉపయోగించడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. లెడ్ లైట్ లు, ఇతర చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మందులు బ్యాండ్ ఎయిడ్ ద్వారా శరీరంలోకి ప్రవేశించే ఏర్పాటు చేస్తున్నారు. చర్మం టెంపరేచర్ లో వచ్చే మార్పులను బట్టి బ్యాండ్ ఎయిడ్ మందులను లోపలకు పంపుతుంది. క్సుంహే జహావు అనే శాస్త్రవేత్త తయారు చేసిన హైడ్రోజెల్ మాట్రిక్స్ ఈ పక్రియకు కీలకం. ఎక్కువగా నీటితో ఉండే ఈ మాట్రిక్స్ ను రబ్బర్ సామగ్రితో తయారు చేస్తారు. బాండ్ బలంగా ఉండి, పైకి బంగారం, టైటానియం, అల్యూమినియం, సిలికాన్ వంటి లోహాల్లా కనిపిస్తుంది. మాట్రిక్స్ లోపలు ఎలక్ట్రానిక్ చిప్ లు ఉంటాయి. ఎల‌క్ట్రానిక్స్ తో కప్పిన మాట్రిక్స్ ను చర్మం పైననే కాకుండా లోపల కుడా ఉపయోగించ వచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

English summary

American Engineers have designed a sticking bandage that releases medicine in response to changes in skin temperature and delivers medicine