బండ్ల 'లారెన్స్' సినిమా

Bandla Ganesh Movie with Raghava Lawrence

09:57 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Bandla Ganesh Movie with Raghava Lawrence

నటుడిగా మెప్పించి సడన్ గా నిర్మాణ రంగాన అడుగుపెట్టిన బండ్ల గణేష్ , టాప్ హీరోలతో విజయవంతమైన సినిమాలను నిర్మించి ‘బ్లాక్‌బస్టర్ నిర్మాత’గా మారాడు. ‘టెంపర్’ లాంటి హిట్ కొట్టి, ఏడాది దాటినా, ఇప్పటికీ కొత్త సినిమా ప్రారంభించలేదు. ఈ గ్యాప్‌లో చిరంజీవి 150వ సినిమా, రామ్ చరణ్‌తో ఓ సినిమా, నితిన్‌తో ఓ సినిమా అంటూ బండ్ల గణేష్ నిర్మించే సినిమా విషయమై చాలా ప్రాజెక్టులు హల్ చల్ చేసాయి. అయితే ఆవన్నీ మాటలవరకే పరిమితం అయ్యాయి. ఏదీ ఖరారవ్వలేదు. ఇక ఇప్పట్లో సినిమా ఉండదని వినిపిస్తున్న నేపధ్యంలో తాను నిర్మించబోయే తదుపరి సినిమా ఏంటన్నది బండ్ల గణేష్ తాజాగా ప్రకటించాడు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఇప్పుడు దర్శకుడిగా తనదైన మార్క్ వేసుకున్న రాఘవ లారెన్స్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు బండ్ల గణేష్ చెప్పాడు. రాఘవ లారెన్స్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించనున్న ‘భైరవ’ అనే సినిమా తెలుగు వర్షన్‌ను బండ్ల గణేష్ నిర్మించనున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో బండ్ల గణేష్ నిర్మించబోతున్నట్టు తేలింది. అయితే ఇంకా పూర్తిస్థాయి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

English summary

Character Artist who become Star Producer Bandla Ganesh has made films with some of the top directors in Telugu Film industry.For few months Bandla Ganesh not committed to any movie.Now he was going to make a film with Choreographer who became director Raghava Lawrence.These two were going to make a graphical film called "Bhairava"