లారెన్స్‌ తో అన్ని కోట్లు అవసరమా ?

Bandla Ganesh To Give 25 Crore Remuneration For Lawrence

04:08 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Bandla Ganesh To Give 25 Crore Remuneration For Lawrence

గోవిందుడు అందరివాడేలే, టెంపర్‌ చిత్రాల తరువాత స్టార్‌ ప్రొడ్యూసర్‌ బండ్ల గణేష్‌ కేవలం స్టార్‌ హీరోలతోనే సినిమాలు తియ్యాలని నిర్ణయించుకున్నాడట. అయితే స్టార్‌ హీరోలు ఎవరూ బండ్ల గణేష్ కి డేట్స్ ఇవ్వకపోవడంతో బండ్ల గణేష్‌ ప్రస్తుతం రీమేక్‌ చిత్రాలు, డబ్బింగ్‌ చిత్రాలపై దృష్టి పెట్టాడు. అయితే ఇప్పుడు గణేష్‌ లారెన్స్‌తో ఒక చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. లారెన్స్‌తో 'నాగ భైరవ' అనే హర్రర్‌ చిత్రాన్ని బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నాడు. ముని సిరీస్‌ లాగానే ఈ చిత్రంలో లారెన్స్‌ దర్శకత్వం వహించి నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని హై విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తెలుగు, తమిళంలో ఒకేసారి బండ్ల గణేష్‌ నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి దాదాపు 25 కోట్లు ఖర్చు చెయ్యనున్నట్లు గణేష్‌ చెప్పాడు.

English summary

After the Successful hit movie like Govindudu Andari Vadele and Temper Movie Producer Bandla Ganesh Decided to do movies with Star Heroes and recently he signed a movie with Raghava Lawrence and Bandla Ganesh to give 25 crore remunneration to Lawrence