బండ్ల' చేతికి  ‘టూ కంట్రీస్’

Bandla Ganesh To Remake Two Countries

10:02 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Bandla Ganesh To Remake Two Countries

అగ్ర హీరోలతో సినిమాలు తీసిన బండ్ల గణేష్ క్యారక్టర్ ఆర్టిస్ట్ నుంచి బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయాడు. ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా భారీ చిత్రాలు నిర్మించే బండ్ల గణేష్ ఇప్పుడు మరో సంచలన సినిమా హక్కుల్ని దక్కించుకున్నాడు. అది కూడా తీవ్ర పోటీ నడుమ... అదికూడా మలయాళ సూపర్ మూవీ రీమేక్ హక్కుల్ని.... దిలీప్, మమతా మోహన్ దాస్ జంటగా నటించిన ‘టూ కంట్రీస్’ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో 50 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి నిర్మాత బండ్ల గణేష్ ప్రయత్నించి, తీవ్ర పోటీలో రీమేక్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీగా నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేస్తున్నాడు.

'మలయాళ బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ చిత్ర హక్కుల్ని భారీ పోటీ మధ్య దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అందుకే భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. టాలీవుడ్‌లో ఉన్న టాప్ స్టార్స్ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి గా వున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి తెలియజేస్తా' అంటూ నిర్మాత బండ్ల గణేష్ వివరిస్తున్నాడు. మరి మెగా ఫామిలీ నుంచా , నందమూరి ఫామిలీ నుంచా... లేక వేరే ఎవరైనా వున్నారా ... ఇంతకీ ఎవరు హీరో .... ఈ టెన్షన్ కి త్వరలో తెర పడనుంది.

English summary

Character Actor Who Became Star Producer in Tollywood Bandla Ganesh has purchased the rights of malayalam movie "Two Countries" which was become superhit at Malayalam box office.Bandla Ganesh Says that he will say the movie details within few days