ఏటీఎం దాడి నిందితుడు ఎలా చిక్కాడంటే..

Bangalore ATM attacker arrested

01:20 PM ON 6th February, 2017 By Mirchi Vilas

Bangalore ATM attacker arrested

ఎంతపేరు మోసిన కేటుగాడైనా, పోలీసుల వలకు చిక్కాల్సిందే. అందుకే, నాలుగేళ్ల కిందట ఏటీఎంలో మహిళపై దాడి చేసిన నిందితుడ్ని ఎట్టకేలకు పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తి పేరు మధుకర్ రెడ్డి. జైలు నుంచి పరారైన నిందితుడు బెంగళూరులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2013లో బెంగ ళూరులోని ఓ ఎటీఎం నుంచి డబ్బులు తీసుకోవ డానికి వ చ్చిన మ హిళ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘ ట న అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. అప్పట్లో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనమైంది. చిత్తూరు పోలీసుల అదుపులోవున్న మధుకర్ రెడ్డిది తంబళపల్లె మండలంలోని ముద్దులాపురం విలేజ్ గా తేలింది.

2006లో ఒకరిని హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదికాకుండా మొత్తం 15 హత్య కేసుల్లో మధుకర్ నిందితుడు. 2011లో కడప జైలు నుంచి పరారైన తర్వాత నిందితుడిపై రూ. 12 లక్షల రివార్డు ప్రకటించారు పోలీసులు. ఏటీఎం ఘటన తర్వాత మధుకర్ కనిపించలేదు. వారం కిందట తన ఇంటికి వస్తున్న క్రమంలో మధుకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఎటీఎం మహిళపై తానే దాడి చేసినట్టు అంగీకరించాడు. రౌడీ షీట్ కూడా యితనైపై నమోదైందని గుర్తుచేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఆయుష్షు పెరగాలంటే ఇవి తినాలట

ఇది కూడా చూడండి: తులసి మొక్క ఆకులు రంగు మారితే ప్రమాదమేనట

English summary

Four years back a person attacked women in ATM recently he was arrested in A.P.