రేడియో జాకీ వినూత్నయాత్ర

Bangalore Radio Jockey Tour On Organs Donation

10:45 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Bangalore Radio Jockey Tour On Organs Donation

'మనం చనిపోయాక మన అవయవాలు వేరొకరికి దానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్లమవుతాము. అంత గొప్పది అవయవదానం . ఇందుకు అందరూ సహకరించాలి' అని కోరుతూ బెంగళూరుకి చెందిన రేడియో జాకీ అనిల్‌ శ్రీవాత్స తన కుటుంబంతో కలిసి ఓ కార్యక్రమాన్ని చేపట్టాడు. గోలా(గిఫ్ట్‌ ఆఫ్‌ లైఫ్‌ అడ్వెంచర్‌) పేరిట అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాడు.

ఇది కూడా చదవండి : సూపర్ స్టార్ రజనీ పై కేసు

అవయవదానంపై అవగాహన కల్పించడానికి బెంగళూరు నుంచి స్కాట్లాండ్‌ వరకు అనిల్‌ తన కుటుంబం, స్నేహితులతో కలిసి బృందంగా ఏర్పడి ప్రయాణం సాగించనున్నాడు. బుధవారం వీరి ప్రయాణం ప్రారంభం అయింది. నేటి నుంచి 90 రోజుల పాటు 15 దేశాలను చుట్టే వచ్చే ఈ వినూత్న కార్యక్రమంలో అవయవదానంపై పలు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ట్రిప్‌ అనంతరం దీనికి సంబంధించి డాక్యుమెంటరీను రూపొందిస్తారు. దీని ద్వారా ప్రజల్లో, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అవయవదానంపై అవగాహన కల్పించి వారిని అందుకు ఒప్పుకునేలా చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం వేరే దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో 0.01 శాతం మాత్రమే వారు చనిపోయాక అవయవాలు దానం చేస్తున్నారని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అనిల్‌ చెబుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

ఎంఎల్ఏ లు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా?

నన్ను ఏమైనా అనండి ... నా కొడుకుని అన్నారో ...

అల్లుడుని ముద్దాడిన సల్మాన్

జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

English summary

A Radio Joackey Named Anil Sri Vatsava From Banglore started a tour that to create Awareness on Organs Donation.He started a Foundation Named Gola(Gift Of Life Adventure) and he and his family travelling to 15 countries in 90 days to create awareness on Organs Donation