పెంపుడు కుక్క ఇష్టం లేదన్నాడని ... పెళ్ళి రద్దు చేసుకున్న యువతి

Bangalore Women Cancelled Her Marriage For Dog

10:53 AM ON 14th September, 2016 By Mirchi Vilas

Bangalore Women Cancelled Her Marriage For Dog

రోజులు ఎలా మారాయో చూసారా? ఓ చిన్న కారణంతో కుదిరిన పెళ్లి కాదనుకుంది. కాబోయే భర్త పెంపుడు కుక్కను ఇష్ట పడకపోవడంతో ఓ యువతి ఏకంగా పెళ్ళినే రద్దు చేసుకుంది. ఈ వింత సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. బెంగళూరుకు చెందిన కరిష్మా వాలియాకు ఓ వ్యక్తితో పెళ్ళి సంబంధం కుదిరింది. ఆమెకు తన పెంపుడు కుక్క అంటే చాలా ఇష్టం. పెళ్ళి తర్వాత కూడా దాన్ని తన వద్ద ఉంచుకుంటున్నానని వాట్సాప్ చాట్ లో అతడితో చెప్పింది. అయితే తనకు ఆ కుక్క అంటే ఇష్టం లేదన్నాడు. తన తల్లికి కూడా కుక్కలంటే ఇష్టం లేదని, తమ ఇద్దరి మధ్య అది ఎందుకని ప్రశ్నించాడు. దీంతో మన పెళ్ళి జరగదని కరిష్మా అతడితో తెగేసి చెప్పింది. సీరియస్ గానే చెబుతున్నావా అని అడగ్గా.. అవుననే సమాధానం ఇచ్చింది.

మనిద్దరి జీవితం ముఖ్యమని, కుక్కతో నీ అనుబంధం తాత్కాలికమేనన్న అతడి వాదనతో కరిష్మా ఏకీభవించలేదు. అనుబంధం తాత్కాలికమే అయినా, తన పెంపుడు కుక్కను పెళ్లి కోసం వదులు కోనని స్పష్టం చేసేసింది. పెళ్ళి తర్వాత దీని కారణంగా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుడదనే ఉద్దేశంతోనే పెళ్ళి వద్దని స్పష్టం చేసింది.

దీంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి అయితే నీ కుక్కనే పెళ్ళి చేసుకో అని సమాధానమిచ్చాడు. ఇక ఈ విషయంపై ఇద్దరి మధ్య వాదనలు అనవసరమని కరిష్మా సూటిగా చెప్పడంతో అక్కడితో వారిద్దరి మధ్య బ్రేక్ పడింది. కుక్క కారణంగా ఓ పెళ్ళి రద్దైన ఈ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు కరిష్మా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయగా, మరి కొందరు ఆ వ్యక్తి వాదనకు మద్దతు పలికారు. అదీ వరస.

ఇవి కూడా చదవండి:పెదాలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

ఇవి కూడా చదవండి:ఇంట్లో ఈ విగ్రహాలు ఉంటే మీ పని అయిపోయినట్టే!

English summary

A Woman Named Karishma Walia fron Bengaluru was engaged with one of the guy and he said that he and his family members didn't like dogs. But she said that the dog was very important to her and she refused to leave her lovable dog and cancelled her marriage. Now this was going viral over the internet.