గదిలోకి అమ్మాయిలను తెచ్చుకున్న క్రికెటర్లు.. ఇది తెలిసిన బోర్డు వాళ్ళని ఏం చేసిందంటే..

Bangladesh cricketers are bringing girls to the room

11:24 AM ON 1st December, 2016 By Mirchi Vilas

Bangladesh cricketers are bringing girls to the room

బంగ్లాదేశ్ లో ఇద్దరు క్రికెటర్ల తీరుని క్రికెట్ బోర్డు తప్పుబట్టింది. అందుకు శిక్ష విధించింది. ఇంతకీ విషయం ఏమంటే, తమ హోటల్ గదులకు అమ్మాయిలను పిలిచి క్రమశిక్షణ నియమాలను ఉల్లంఘించారన్న అభియోగంపై ఇద్దరు ఆటగాళ్లకు బంగ్లాదేశ్ క్రికిట్ బోర్డు భారీ జరిమానా విధించింది. తప్పిదాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు మరోసారి ఇలాంటివి జరిగితే కఠినంగా దండించక తప్పదని హెచ్చరించింది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడుతున్న పేస్ బౌలర్ అల్ అమీన్ హుస్సేన్, బ్యాట్స్ మన్ షబ్బీర్ రహమాన్ కు దాదాపు రూ.10 లక్షల చొప్పున(15వేల డాలర్లు) జరిమానా విధించింది.ఆటగాళ్లకు జాతీయ జట్టుకు సేవలందించాల్సిన బాధ్యత వుందని గుర్తుచేసింది. జట్టు ప్రతిష్ఠను మసకబార్చే పనులు చేయవద్దని, మరోసారి ఇలా జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బోర్డు హెచ్చరించింది.

English summary

Bangladesh cricketers are bringing girls to the room