యూఏఈని ఆటాడుకున్న బంగ్లా

Bangladesh Win Over UAE In Asia Cup

04:36 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Bangladesh Win Over UAE In Asia Cup

బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ఆసియా కప్‌లో పసికూన యూఏఈని ఆతిథ్య బంగ్లాదేశ్ టీమ్ ఒక ఆట ఆడుకుంది. మీర్పూర్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 51 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లా చేతిలో చిత్తయ్యింది. టాస్‌ గెలిచిన యూఏఈ బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్‌ మిథున్‌(47) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్య ఛేదనలో యూఏఈ బంగ్లా బౌలర్ల ముందు ఏ మాత్రం నిలబడలేకపోయింది. యూఏఈ టాప్‌ ఆర్డర్‌ దారుణంగా విఫలమైంది. ఆ జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్లు రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో యూఏఈ 17.4 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీలో యూఏఈకి ఇది వరుసగా రెండో ఓటమి.

English summary

Yesterday the hosts Bangladesh wins Over UAE in Asia Cup 2016.Bangladesh Recorded a 51 runs win over UAE in the Asia Cup Match.