'ఉగ్ర' వీడియోలో బంగ్లాదేశ్ టాప్ మోడల్ మాజీ భర్త

Bangladeshi Model Ex Husband Hand In Dhaka Bomb Blasts

10:59 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Bangladeshi Model Ex Husband Hand In Dhaka Bomb Blasts

ఉగ్రవాదులు ప్రపంచంలో నరమేధానికి పాల్పడుతూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇక ఢాకాలో ఇటీవల చెలరేగిపోయిన ఉగ్రవాదులు ఓ బేకరీలో మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడిలో పాల్గొన్నవారందరూ ఉన్నత కుటుంబం నుంచి వచ్చినవారే కాకుండా విద్యావంతులు కూడా కావడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఉగ్రవాదుల్లో ఒకరు స్వయంగా అధికార పార్టీ నేత కొడుకు అని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది. అయితే తాజాగా ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసిన ఓ వీడియోలో కనిపిస్తున్న ఉగ్రవాదుల్లో ఒకరు బంగ్లాదేశ్ టాప్ మోడల్ నైలా నేయెమ్ మాజీ భర్త తుషార్ ఉండడం కలకలం సృష్టిస్తోంది.

బంగ్లాదేశ్ ఆర్మీ మాజీ మేయర్ వషీకుర్ ఆజాద్ కుమారుడైన తుషార్ దంతవైద్య నిపుణుడు.2001లో ఆయన నేయెమ్ ను వివాహం చేసుకున్నాడు. ఢాకాలోని బరిధారా డిఫెన్స్ ఆఫీసర్స్ హౌసింగ్ స్కీం నివాసి అయిన తుషార్ ఆ తర్వాత మనస్పర్థల కారణంగా భార్య నుంచి విడిపోయారు. గత రెండేళ్లుగా ఆయన కనిపించకుండా పోయాడు. ఇప్పుడు తాజాగా ఈ వీడియోలో దర్శనమివ్వడంతో ప్రభుత్వం నివ్వెరపోయింది. కాగా వీడియోలో ముసుగుతో కనిపిస్తున్న రెండో వ్యక్తిని తౌసిఫ్ హొస్సైన్ గా అధికారులు గుర్తించారు. ఢాకా యూనివర్సిటీ నుంచి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఐబీఏ) విద్యార్థి. కోర్సు పూర్తికాకుండానే యూనివర్సిటీని విడిచిపెట్టాడు. మూడో వ్యక్తి తహ్మిద్ రహ్మాన్ షఫీ. గ్రామీణ్ ఫోన్ అధికారి. మాజీ ఎలక్షన్ కమిషనర్ షఫియుర్ రహ్మాన్ కుమారుడని అతని ఒకప్పటి క్లాస్ మేట్లు తెలిపారు. బంగ్లాదేశ్ టీవీ చానల్ ఎన్ టీవీలో 1995లో నిర్వహించిన రియాలిటీ మ్యూజిక్ షో క్లోజప్-1 టాప్ టెన్ ఫైనలిస్టుల్లో షఫీ ఒకడు కావడం గమనార్హం. బీబీఏ, ఎంబీఏ పూర్తిచేశాడు. తాను ఐఎస్ఐఎస్ లో చేరుతానని తండ్రిని అడిగాడు. ఆయన అంగీకరించకపోవడంతో తండ్రికి తెలియకుండా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ లో చేరినట్టు తెలుస్తోంది. ఢాకాలో జరిగిన దాడిని ప్రశంసిస్తూ వీరు ముగ్గురూ వీడియోలో మాట్లాడారు. ఇక ఉగ్రవాదం ఎప్పుడు ఆగేది. ఎవరు ఆపేది అన్నట్లు తయారయింది. వ్యవస్థ చెడిపోయిందని అందరూ అనడమే గానీ ఈ సిస్టంలో మార్పు తేవడానికి ఎవరికీ పట్టదు. అందుకే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. వినాశాకాలే విపరీత బుద్ధీ అన్నారు అందుకే..

ఇవి కూడా చదవండి:పెళ్ళైన వ్యక్తితో ప్రేమ యవ్వారం - కూతురిని చంపేసిన తల్లి

ఇవి కూడా చదవండి:బంగ్లాదేశ్ లో మళ్లీ పేలుళ్లు

English summary

Recently Continuous Bomb Blasts shaked our Neighbouring country Bangladesh and the officials found few of the people who were linked with these bomb blasts there were popular people of Bangladesh hand in these Blasts.