సెక్స్ సరదాల కోసం బ్యాంకు నుండి తెలివిగా 100 కోట్లు కొట్టేసాడు

Bank manager did 100 crores fraud in Bangalore

11:05 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Bank manager did 100 crores fraud in Bangalore

అవును మీరు విన్నది నిజమే ఒక వ్యక్తి తన శృంగార సరదాల కోసం బ్యాంకు నుండి ఏకంగా 100 కోట్లు కొట్టేసాడు. అసలేం జరిగిందో మేటర్ లోకి వెళ్ళిపోదాం.. తన సెక్స్ సరదాలకోసం ఓ బ్యాంక్ ఉద్యోగి సాగించిన నిర్వాకం బెంగుళూరు సిఐడీ పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. విజయపురలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో మేనేజరుగా పని చేసిన జొన్నలగడ్డ విజయసారథి అనే వ్యక్తి మూడేళ్ళ కాలంలో ఏకంగా వందకోట్లు ఫ్రాడ్ చేసి, తన సరస సల్లాపాలు తీర్చుకునేందుకు పది కోట్లు ఖర్చు చేశాడని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. 2012 నుండి 2015 వరకు 41 ఏళ్ళ సారథి ఇలా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడని తెలిసింది.

పరారీలో ఉన్న ఇతడ్ని ఖాకీలు ఇండో-నేపాల్ సరిహద్దుల్లో ఇటీవల అరెస్టు చేశారు. ఇతనితో పాటు మరో ఇద్దరినీ కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు అందమైన మోడల్స్, యువతులతో గడిపేందుకు విదేశాలు కూడా తిరిగాడని, ఫైవ్ స్టార్ హోటళ్ళలో బస చేస్తూ ఒక్కో రాత్రికి యువతులకు 5 లక్షలు, టిప్ గా మరో లక్ష రూపాయలు ఇచ్చేవాడని తెలిసింది. ఇతనికి అతి ఖరీదైన 23 కార్లు ఉన్నాయట. వీటిలో 13 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో భార్యను, కూతురిని వదిలేసిన విజయ సారథి రేణుకా శెట్టి అనే గర్ల్ ఫ్రెండ్ తో గడుపుతూ ఆమె పేరిట భారీగా ఆస్తులు కొన్నాడట.

బెంగుళూరు జేపీ నగర్ లో రెండు కోట్లు ఖరీదు చేసే లగ్జరీ విల్లా, సౌత్ కన్నడ జిల్లాలో ఆరు ఎకరాల భూమిని కొన్నాడని పోలీసులు తెలిపారు. మయన్మార్ కు చెందిన ఇతగాడు బళ్లారిలో సెటిల్ అయ్యాడని, ఇతని నుంచి డబ్బు ఎలా రాబట్టాలో ఆలోచిస్తున్నామని అధికారులు, పోలీసులు చెప్తున్నారు.

English summary

Bank manager did 100 crores fraud in Bangalore. ICICI bank manager Jonnalagadda Vijayasaradhi did 100 crores fraud.