బ్యాంకుకి వచ్చారు... దర్జాగా దోచుకుపోయారు..

Bank robbery Bhopal UCO bank

05:27 PM ON 31st March, 2016 By Mirchi Vilas

Bank robbery Bhopal UCO bank

దొంగలు పడడం, దోచుకుపోవడం మామూలే.. కానీ పట్టపగలే, అందునా సెక్యూరిటీ అడ్డుకున్నా సరే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూకో బ్యాంకులో దొంగలు పడి దోచుకుపోయారు. బుధవారం సాయంత్రం ఈ బ్యాంకులోకి చొరబడిన ఇద్దరు దొంగలు కత్తులతో బ్యాంకు సిబ్బందిని బెధిరించి రూ. 5 లక్షలకు పైగా దోచుకుపోయారు. ఇదంతా.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దొంగలు తాపీగా తమ పని కానిచ్చుకుని వెళ్తుంటే ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనతో బ్యాంకుల వద్ద సెక్యూరిటీ ని పెంచాలని బ్యాంకు సిబ్బంది చేస్తున్న విన్నపాలు అరణ్య రోదనలే అవుతున్నాయని చెప్పవచ్చు.

English summary

Bank robbery Bhopal UCO bank. High range bank robbery in Bhopal UCO bank.