పొరపాటుగా మీ డబ్బులు వేరే అకౌంట్ కి ట్రాన్సఫర్ అయిపోతే ఇలా చేయండి..

Bank transfer mistakes if credited or debited

02:29 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Bank transfer mistakes if credited or debited

ఒకప్పుడు ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బ్యాంకు బేరర్ చెక్ ఇచ్చేవాళ్లం. కానీ, నేడు దాదాపుగా అందరమూ నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సఫర్ చేస్తున్నాం. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్సఫర్ సమయాల్లో ఒక్క డిజిట్ తేడా వచ్చినా నగదు వేరే వారి అకౌంట్ కి ట్రాన్సఫర్ అయిపోతుంది. ఒకవేళ వేరే అకౌంట్ కి ట్రాన్సఫర్ అయిపోతే పరిస్థితి ఏంటి? మన డబ్బు వెనక్కి వస్తుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఒకవేళ పొరపాటుగా భారీ మొత్తంలో డబ్బు వచ్చి మన అకౌంట్ లో జమ అయితే... మూడో కంటికి తెలియకుండా ఉంచేసుకోవాలా? లేక బ్యాంకుకు తెలియజేసి నిజాయతీ చాటుకోవాలా..? ఇటువంటి సందర్భాల్లో ఖాతాదారులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి? బ్యాంకు నిబంధనలు ఏమిటన్న విషయంపై అవగాహన ఉంటే మంచిది.

1/11 Pages

శాంతి ఓ రోజు ఐసీఐసీఐ బ్యాంకులోని తన ఖాతా నుంచి రూ.30 వేలను ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేసింది. అయితే, అకౌంట్ నంబర్ చివరి మూడు అంకెలు 339 ఉంటే ఆమె 399 ఎంటర్ చేసి ట్రాన్సఫర్ చేసేసింది. దీంతో డబ్బు వేరే వారి అకౌంట్ కు వెళ్లిపోయింది. జరిగిన పొరపాటును గుర్తించిన శాంతి వెంటనే బ్యాంకు శాఖకు వెళ్లి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చింది. కానీ, లాభం లేదు. దాంతో కొన్ని రోజుల తర్వాత ఆమె మరోసారి బ్యాంకుకు వెళ్లి విచారించింది. మరోసారి దరఖాస్తు కూడా సమర్పించింది. ఎన్నో మెయిల్స్ కూడా పెట్టింది. చివరికి బ్యాంకు నుంచి వచ్చిన సమాధానం విని ఆమె కంగుతింది. అదేమిటంటే, ఆమె ట్రాన్సఫర్ చేసిన డబ్బు జమ అయిన ఖాతాదారుని అనుమతి లేకుండా... ఆ నగదును తిరిగి వెనక్కి బదిలీ చేయలేమని బ్యాంకు సిబ్బంది చెప్పారు.

English summary

Bank transfer mistakes if credited or debited