కావూరి తీరుపై బ్యాంకర్ల నిరసన 

Bankers Oppose Kavuri Sambha Siva Rao

06:22 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Bankers Oppose Kavuri Sambha Siva Rao

దేశంలో బడా బాబులు బాంకులకు ఎగనామం పెడుతుంటే , తాజాగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత కావూరి సాంబశివరావు బ్యాంకులకు భారీ ఎత్తున టోక్రా వేశారు. కావూరికి చెందిన ప్రొగ్రెసివ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బకాయి రుణాలు చెల్లించకుండా మొండికేయడంతో బ్యాంక్‌ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. 18 బ్యాంకులకు దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర బకాయి పడ్డారని చెబుతున్నారు.

హైదరాబాద్ అబిడ్స్‌లో ఉన్న సాంబ‌శివ‌రావుకు చెందిన కంపెనీ ప్రొగ్రెసివ్ క‌న్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ కార్యాల‌యం ఎదుట వివిధ బ్యాంకుల‌కు చెందిన ప్రతినిధులు సోమవారం మౌన పోరాటానికి దిగారు. రుణాలు చెల్లించి తమ బ్యాంకులు దివాళా తీయకుండా కాపాడాలని ఆయా బ్యాంకుల ప్రతినిధులు ప్లకార్టులు పట్టుకుని మరీ ఆందోళన సాగిస్తూ , డిమాండ్‌ చేశారు.

English summary

Bankers fired wx- central minister and now BJP leader kavuri sambha siva rao for not paying money to the banks