రద్దయిన పెద్ద నోట్లలో బ్యాంకులకు చేరినవెన్నో తెలుసా?

Banks Receive Rs. 12.44 Lakh Crore Of Old 500 Notes

10:49 AM ON 14th December, 2016 By Mirchi Vilas

Banks Receive Rs. 12.44 Lakh Crore Of Old 500 Notes

నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు తర్వాత నేరుగా బ్యాంకుల్లో జమచేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెల్సిందే. కొన్ని రోజులు డబ్బు మార్పిడి కి కూడా అవకాశం ఇచ్చింది. మొత్తం మీద ఎలాగైతేనేం నవంబర్ 8నుంచి డిసెంబర్ 10వరకు వివిధ బ్యాంకుల్లో రూ.12.44లక్షల కోట్లు జమ అయ్యాయి. ఈవిషయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్ బీఐ) వెల్లడించింది. ఇక రూ.4.61లక్షల కోట్ల కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది.

‘రూ.500, వెయ్యి నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు వచ్చిన ఆ నోట్ల మొత్తం విలువ రూ.12.44 లక్షల కోట్లు. డిసెంబర్ 10వ తేదీ వరకు బ్యాంకులకు ఈ మొత్తం చేరింది. ఏటీఎంలు, బ్యాంకులోని క్యాష్ కౌంటర్ల ద్వారా రూ.4.61లక్షల కోట్ల కొత్త నోట్లను జారీ చేశాం.’ అని ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్ల సంఖ్య 21.8 బిలియన్లు అని, వీటిలో రూ.10, 20, 50, 100 నోట్ల సంఖ్య 20.1 బిలియన్లు కాగా, కొత్త రూ.500, 2వేల నోట్ల సంఖ్య 1.7 బిలియన్లు' అని గాంధీ వివరించారు. ఇక జమ అయిన పాత నోట్ల సంఖ్య 1 ట్రిలియన్ గా వెల్లడించారు.

ఇది కూడా చూడండి: విష్ణుమూర్తి నారాయణుడు ఇలా అయ్యాడు

ఇది కూడా చూడండి: ఆఫీస్ లో లేడీ బాస్ కంటే మెన్ బాస్ ఉంటే కలిగే ప్రయోజనాలు...

ఇది కూడా చూడండి: రామరాజ్యం అని ఎందుకంటారో తెలుసా?

English summary

Banks Receive Rs. 12.44 Lakh Crore Of Old 500 Notes