సెక్సీగా ఉందంటూ సొంత దేశంలోనే ఆమె యాడ్ బ్యాన్(వీడియో)

Bar Refaeli hot photoshoot

03:30 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Bar Refaeli hot photoshoot

అవునా, తేడా ఎక్కడ వచ్చినట్టు... ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగంలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న భామల్లో ఒకరైన బార్ రెఫెలీ అందంతో మతి పోగొట్టేస్తుందని అంటారు కదా. కుర్రాళ్ల పై తన సెక్సీ ఒంపుసొంపుల బాణాలు విసిరే ఆమెకు ఫాలోయింగ్ కూడా బానే ఉంది. అందుకే పలు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్ ఆమెతో యాడ్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అదే కోవలో బార్ రెఫిలీ హుడీస్ అనే ఇంటర్నేషల్ ఫ్యాషన్ బ్రాండ్ ను ప్రమోట్ చేసే అవకాశం దక్కించుకుంది. హుడీస్ సంస్థ రూపొందించిన లో దుస్తులు, స్విమ్ సూట్స్ తరుపున ప్రచారం చేయడంలో భాగంగా ఇటీవల బార్ ఫర్ హుడీస్ పేరుతో ఓ యాడ్ చిత్రీకరించారు.

బికినీలో ఆమె పై చిత్రీకరించిన యాడ్ చాలా సెక్సీగా ఉండటంతో రెస్పాన్స్ అదుర్స్. హుడీస్ సంస్థ ఇజ్రాయెల్లో కూడా ఇదే యాడ్ ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఇతర దేశాల్లో ఈ యాడ్ మీద ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు కానీ ఇక్కడ మాత్రం ఆ దేశ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ యాడ్ చాలా సెక్సీగా ఉందని.... ఇంత సెక్సీగా ఉన్న యాడ్లు టీవీల్లో ప్రసారానికి తాము ఒప్పుకోమని, ఈ యాడ్లో సెక్సీగా ఉన్న కొన్ని క్లిప్స్ కట్ చేస్తేనే అనుమతి ఇస్తామని తేల్చి చెప్పింది. కాదు కూడదు అంటే రాత్రి 10 తర్వాతే ప్రసారం చేసుకోవాలని తేల్చి చెప్పింది. బార్ రెఫిలీ సొంత దేశం ఇజ్రాయెల్ దేశంలోనే ఆమె యాడ్ ను బ్యాన్ చేయడంతో ఇక హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ఏమిటబ్బా అని అంతా జుట్టు పీక్కుంటున్నారట.

English summary

Bar Refaeli hot photoshoot