ఒబామా డిన్నర్ ఖర్చు వింటే ఆశ్చర్యపోవాల్సిందే!

Barack Obama dinner in small restaurant

12:07 PM ON 26th May, 2016 By Mirchi Vilas

Barack Obama dinner in small restaurant

మామూలుగా సెలబ్రిటీలు, సినీ నటులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు సరదాగా బయటకి వెళ్లినపుడు డిన్నర్ చేయాలంటే ఆ డిన్నర్ ఖర్చు వేలల్లో ఉంటుంది. అలాంటిది అగ్ర దేశం అయిన అమెరికా అధ్యక్షుడు డిన్నర్ అంటే ఆ ఖర్చు ఏ రేంజ్లో ఉంటుందో అని ఊహించుకుంటేనే మతి పోతుంది. కానీ అమెరికా అధ్యక్షుడు ఒబామా డిన్నర్ ఖర్చు వింటే ముక్కు మీద వేలు వేసుకుంటారు, అంతే కాదు ఆయనకీ అభిమానులు కూడా అవుతారు. అమెరికా అధ్యక్షుడైన బరాక్ ఒబామా ఓ మామూలు కాకా హోటళ్లో డిన్నర్ చేశారు. మామూలుగా అయితే వేలల్లో ఇంకా చెప్పాలంటే లక్షల్లో ఖర్చ పెట్టే అంత రేంజ్ ఉన్నా కేవలం 400 రూపాయలతోనే ఆయన డిన్నర్ పూర్తి చేసేశారట.

అసలు విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వియత్నాం పర్యటనలో భాగంగా సీఎన్ఎన్ రిపోర్టర్ ఆంథోనీ బౌర్డియాన్ తో కలిసి హనోయిలోని ఓ రోడ్ సైడ్ రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేశారట. ఇద్దరూ కలిసి బీరు తాగి, నూడిల్స్, సూప్, గ్రిల్డ్ పోర్క్ వంటివన్నీ తిన్నారు. చిన్న హోటల్ కావడంతో బిల్లు కేవలం ఆరు డాలర్లు మాత్రమే అయింది. అంటే సుమారు 400 రూపాయలు అన్నమాట. చిన్న నీలిరంగు ప్లాస్టిక్ స్టూల్ పై కూర్చుని ఒబామా డిన్నర్ చేస్తున్న చిత్రాలను ఆంథోనీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రపంచం ఆశ్చర్యానికి లోనయింది. ఒక్కసారిగా ఆ హోటళ్లో ఒబామా ప్రత్యక్షం అవటంతో అక్కడి ప్రజలు అతనితో కరచాలనం చేసేందుకు ఆసక్తి చూపుతూ ఫొటోలు కూడా దిగారు.

అయితే ఈ హోటల్ లో ఒబామా చేసిన డిన్నర్ ఖర్చు కేవలం ఆరు డాలర్లు మాత్రమే అంటూ ఆంథోని ట్వీట్ చేశారు. తన పదవీ కాలం చివరి దశలో ఇలా ఒక సాధారణ జర్నలిస్టుతో రోడ్డు పక్క హోటల్లో భోజనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఎంత హోదా ఉన్నా ఇలా సింప్లిసిటీగా ఆయన గడుపుతారు. అందుకే ఒబామాకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

English summary

Barack Obama dinner in small restaurant