ఇస్లాంపై దాడి.. అన్ని మతవిశ్వాసాలపైనా దాడి: ఒబామా

Barack Obama first visit to mosque as president

05:32 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Barack Obama first visit to mosque as president

ఇస్లాం మతంపై దాడి చేయడమంటే అన్ని మత విశ్వాసాలపైనా దాడి చేయడమేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. ఒక వర్గం ప్రజలను అనుమానంతో చూడటం అమెరికా సామాజిక నిర్మాణానికి విఘాతం కలిగించడమే అన్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం రేసులో ఉన్న డొనాల్డ్‌ట్రంప్ ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని ఈ సందర్భంగా ఒబామా తీవ్రంగా ఖండించారు. పారిస్, కాలిఫోర్నియా ఉగ్రదాడుల తర్వాత అమెరికన్ ముస్లింలపై వివక్ష పెరుగుతోందని ఒబామా అన్నారు. అయితే అది సరికాదని కొందరు దుండగుల చర్యలకు మొత్తం ఇస్లాం సమాజాన్నే శంకించడం తప్పని ఒబామా అభిప్రాయపడ్డారు. మేరీల్యాండ్ ప్రాంతంలోని ఒక మజీద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒబామా పాల్గొన్నారు. దేశాధ్యక్షుడి హోదాలో ఒబామా ఒక మజీద్‌ను సందర్శించిడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

English summary

Barack Obama first visit to mosque as president. Obama said those who demonize all Muslims for the acts of a few are playing into extremists’ hands.