వెలుగు చూసిన సీనియర్ ఒబామా లెటర్... షాకింగ్ న్యూస్

Barack Obama letter

01:30 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Barack Obama letter

గతంలోకి వెళ్తే మనిషి వికాసానికి, చైతన్యానికి లెటర్స్ ఎంతో దోహదపడేవి. జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్య సమరంలో జైలులో వుండగా రాసిన లెటర్స్ ఆయన కూతురు ఇందిరా గాంధిని తిరుగులేని నాయకురాలిగా తీర్చిదిద్దాయి. లెటర్ కి అంతటి పవర్ వుండేది. ఇలాంటివి చరిత్రలో ఎప్పుడో జరిగిన కొన్ని సంఘటనలను గురించి తెలుసుకుంటున్నా, ఆ కాలంలో నివసించిన పలువురు గొప్ప వ్యక్తుల జీవిత గాథలను, లేదా ఇతరుల కథలను చదివినా మనకు అదోలాంటి ఉత్సుకత, ఆసక్తి కలుగుతుంది. అప్పట్లో జరిగిన ఆ కథలు, సంఘటనలు ఇప్పుడు చదువుతుంటే ఒకింత ఆశ్చర్యం కూడా వేయక మానదు.

అలాంటి ఆశ్చర్యం కలిగించే ఒకప్పటి కాలానికి చెందిన ఓ లెటర్ పట్ల ఇప్పుడు పాఠకుల్లో ఎక్కడ లేని ఆసక్తి కల్గిస్తోంది. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? దాన్ని ఎవరు ఎవరికి రాశారు? వంటి విషయాలు తెల్సుకోవాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. బరాక్ హుస్సేన్ ఒబామా ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు అందరికీ చిరపరిచితమే. ఆయన గురించి తెలియని వారు ఇంచుమించు ఉండరనే చెప్పవచ్చు. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఈయన 2008లో గెలుపొందారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన మొదటి ఆఫ్రికన్ గా ఈయన చరిత్రకెక్కారు. ఈయన జన్మస్థలం అమెరికానే అయినా తండ్రి సీనియర్ ఒబామాది మాత్రం కెన్యా దేశానికి చెందిన వ్యక్తి.

ఆయన చదువు కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడడంతో బరాక్ ఒబామా కూడా అక్కడే జన్మించారు. కాగా సీనియర్ ఒబామా ధనవంతుడు కూడా కాదు. పేద కుటుంబం కావడంతో ఆయన చదువుకు ఇబ్బంది కలుగుతూ ఉండేది. ఈ క్రమంలో పాఠశాల విద్యను ఆయన ఎలాగోలా పూర్తి చేశాడు. అయితే కాలేజీ విద్య కోసం ఆయనకు అదనపు ధనం అవసరం కావడంతో అమెరికాలో విద్యను అభ్యసించడం కోసం కెన్యాలో ఉన్న ఆఫ్రికన్-అమెరికన్ ఇనిస్టిట్యూట్ కు ఆయన ఓ లేఖ రాశారు. తన కళాశాల చదువు కోసం ఆర్థిక సహాయం కావాలని అభ్యర్థిస్తూ సదరు ఇనిస్టిట్యూట్ కు రాసిన ఆ లేఖలో ఏముందో ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

అమెరికాలో ఉన్న ఎన్నో ఇనిస్టిట్యూట్స్ కు తాను దరఖాస్తు చేసుకున్నానని, వాటిలో కొన్నింటి నుంచి తనకు రిప్లై వచ్చిందని, వాటిలో ఏదో ఒక దాంట్లో తాను కళాశాల విద్యను అభ్యసించదలిచానని, అందుకు తగిన స్కాలర్ షిప్ ను అందించాలని సీనియర్ ఒబామా ఆ ఇనిస్టిట్యూట్ కు రాసిన లెటర్ లో అభ్యరించారు. 1958వ సంవత్సరం, అక్టోబర్ 20న ఆయన లెటర్ రాయగా, దాన్ని ఇనిస్టిట్యూట్ వారు అక్టోబర్ 27న అందుకున్నారు. కాగా ఇప్పుడీ లెటర్ హర్లెంలో ఉన్న స్కాంబర్గ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ లో కల్చర్ బ్లాక్ లో భద్రంగా దాచారు. దీన్ని పలువురు ఇటీవల మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఇప్పుడీ లెటర్ పట్ల అమెరికా పౌరుల్లోనే కాదు దాదాపు అన్ని దేశాల్లోనూ చర్చ జరుగుతోంది. అవును మరి, అలాంటి ప్రముఖులకు చెందిన ఏ విషయమైనా చర్చనీయాంశమే కదా! స్కాలర్ షిప్ కోసం ఆ రోజుల్లో ఒబామా తండ్రి లెటర్ పెట్టారంటే, మామూలు విషయం కాదని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఇలాంటివి మనదేశంలో కోకొల్లలు. అమెరికాలో అరుదుగా వుంటాయి.

English summary

Barack Obama letter