కుక్క కావాలా బాబూ..

Bark N Borrow

07:00 PM ON 30th December, 2015 By Mirchi Vilas

Bark N Borrow

కుక్క పిల్లలంటే చాలామందికి అమితమైన ఇష్టం. వాటిని పెంచుకోవాలని ఉన్నా చిన్న ఇల్లు, అపార్ట్‌మెంట్లు, తక్కువ ఆదాయం కారణంగా అనేకమందికి అది తీరని కోరికగానే మిగిలిపోతుంది. కొద్దిరోజుల పాటు కుక్క పిల్లలను పెంచుకోవాలనే జంతుప్రియుల కోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది అమెరికాలో మాత్రమే ప్రస్తుతం పనిచేస్తుంది. www.barknborrow.com ఆధ్వర్యంలో ఈ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌ ద్వారా మనం వివిధ జాతులకు చెందిన శునకాలు, వాటి యజమానులు... తదితర వివరాలను తెలుసుకోవచ్చు. అనంతరం వారితో మాట్లాడి కొన్ని రోజులు ఆ శునకాలను మన ఇంటికి తెచ్చుకొని పెంచుకునే సౌలభ్యముంది. ఈ యాప్‌ ద్వారా అనేకమంది జంతుప్రేమికులు తమకు ఇష్టమైన శునకాలను కొద్ది రోజులు పెంచుకుంటూ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ యాప్‌ యాపిల్‌ ఫోన్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే ఆండ్రాయిడ్, విండోస్ యూజర్లకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.

English summary

Bark‘N’Borrow is the perfect matchmaking service for dog lovers who can’t have a dog FULL TIME and dog owners who are in need of a helping hand on a PART TIME basis.