ఎపిలో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ 

Basavatarakam Cancer Hospital In Andhra Pradesh

12:21 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Basavatarakam Cancer Hospital In Andhra Pradesh

రాష్ట్ర విభజన నేపధ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో వున్న బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆసుపత్రి ఛైర్మన్‌, సినీనటుడు బాలకృష్ణ స్వయంగా ఈ విషయం ప్రకటించారు. పేదలకు తక్కువ ధరకే వైద్యం అందించేందుకు ఎన్టీఆర్‌ ఈ ఆసుపత్రిని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా ఆసుపత్రిని విస్తరిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయస్థాయి పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని బాలకృష్ణ వివరించారు. బంజారాహిల్స్‌లోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటం బాధాకరమన్నారు. కాగా ఎపిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురంలోని హిందూపురం లోనే పెడతారనే భావిస్తున్నారు. అప్పట్లో ఎనటిఆర్ ఆ తర్వాత హరికృష్ణ ,ఇప్పుడు బాలయ్య ... ఇలా ఎన్టిఆర్ కుటుంబంలో ఎవరు బరిలో నిలిచినా, ఆదరించి విజయం చేకూర్చిన హిందూపురం లో క్యాన్సర్ ఆసుపత్రి పెట్టడమే సబబని ఇప్పటికే కొందరు సూచించినట్లు భోగట్టా.

English summary

Hindupuram MLA Actor Nandamuri Balakrishna said that he was planning to build another Basavatarakam cancer hospital in AndhraPradesh and he also said that that hospital will planning to build in Hindupuram