తమిళనాడులో బయటపడ్డ నేలమాళిగ!

Basement found in Tamil Nadu

11:29 AM ON 30th November, 2016 By Mirchi Vilas

Basement found in Tamil Nadu

తిరువనంతపురంలో నేలమాళిగ గురించి అందరికీ తెలుసు. కానీ తాజాగా తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పురాతన ఆలయంలో సువిశాలమైన నేలమాళిగ బయటపడింది. అందులో తపోసమాధి స్థితిలో మూడు అస్తిపంజరాలు సైతం కనిపించాయి. బన్రుట్టి సమీపంలోని సి.ఎన్.పాళెయం గ్రామంలో పురాతన పుష్పగిరి మలైయాండవర్ ఆలయం ఉంది. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేస్తున్న సిబ్బందికి ఆదివారం ఆలయంలో ఒకచోట భూమి లోపలకు వెళ్లేందుకు మార్గం ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆ ప్రదేశంలోని అడ్డంకులు తొలగించి చూడటంతో భూగర్భ మార్గం వెలుగు చూసింది.

1/4 Pages

ఈ విషయం వెంటనే బయటకు పొక్కడంతో ఆలయానికి వచ్చిన భక్తులు, బన్రుట్టివాసులు, జీర్ణోద్ధరణ కమిటీ నిర్వాహకులు ఆ మార్గం ద్వారా భూగర్భంలోకి వెళ్లారు. అక్కడ అద్భుతమైన నిర్మాణశైలిలో వందల చదరపు అడుగుల్లో సువిశాలమైన నేలమాళిగ దర్శనమిచ్చింది.అందులో తపోభంగిమలోని మూడు అస్తి పంజరాలు కనిపించడంతో ఎవరో సిద్ధులు జీవసమాధి పొందినట్లు భావిస్తున్నారు. తర్వాత నేలమాళిగలోకి భక్తులు, స్థానికుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆలయవర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పురావస్తుశాఖ, శాసనాల పరిశోధకులు అక్కడకు చేరుకుని నేలమాళిగను పరిశీలించారు.

English summary

Basement found in Tamil Nadu