1250 బాటిళ్ల మిరపకాయ సాస్ తో భయంకర స్నానం(వీడియో)

Bathing in 1250 bottles of Chilli sauce

05:40 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Bathing in 1250 bottles of Chilli sauce

భోజనం తినేటప్పుడు నోటికి ఒక మిరపకాయి తగిలితేనే నోరంతా అగ్గి రాసుకున్నంత పనవుతుంది. స్నానం చేసేటప్పుడు కాస్త వేడి నీళ్లు ఒంటి మీద పడితేనే విలవిల లాడతాం. అలాంటిది ఏకంగా మిరపకాయ సాస్ తో స్నానం చేస్తే, అది కూడా బట్టలు లేకుండా! అలాంటి సాస్ తో నిండి ఉన్న టబ్ లో పూర్తిగా మునిగి స్నానం చేస్తే..! ఇంకేముంది ఒళ్లంతా మంటలు, వేడి పుట్టి గుక్క పెట్టి అరుస్తాం. అదే కంటిలోకి వెళితే ఇక ఆ బాధ చెప్పుకోలేం. కానీ అచ్చం అలాంటి ప్రయోగమే చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా 1250 బాటిళ్ల మిరపకాయల సాస్ ను స్నానం చేసే టబ్ లో పోసి ఒంటిపై బట్టలు లేకుండా, ఒక లోయర్ మాత్రం వేసుకుని అందులో మునిగాడు. అక్కడ మొదలైంది అతగాడి రచ్చ.

ఒళ్లంతా మంటతో ఒకటే కేకలు పెట్టాడు. వెంటనే షవర్ కిందకు వెళ్లిపోయి చన్నీటితో స్నానం చేసాడు. ఇదంతా ఎందుకంటారా? ఇంకేముంది యూట్యూబ్ లో ఆ వీడియో పెట్టి పాపులారిటీ సంపాదించడం కోసం. అయితే అనుకున్నది మాత్రం సాధించాడు. 25 లక్షలకు పెగా వ్యూస్ లభించాయి. ఓ భయంకరమైన సినిమా చూసినట్టుందని పలువురు కామెంట్ చేశారు. కొందరు అయ్యో పాపం అన్నారు. ఇంకొందరు ఇలాంటివి నాకు నచ్చవని చెప్పారు. ఏదేమైనప్పటికీ పాపులారిటీ కోసం ఇలా వింత ప్రయోగాలు చేయడం చాలా కామన్ అయిపోయింది. జిహ్వకో రుచి కదా.. అయితే ఇక్కడ సదరు వీడియోలో సాహసం చేసిన వ్యక్తి ఒక విషయం మాత్రం స్పష్టం చేశాడు. ఆ సాస్ తయారు చేసినందుకు ఉపయోగించిన మిరపకాయలన్నీ కాలం చెల్లినవట.

English summary

Bathing in 1250 bottles of Chilli sauce