వేడి నీళ్లతో స్నానం చేస్తే అరగంట వ్యాయామం చేసినట్లే!

Bathing with hot water is good for health

04:40 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Bathing with hot water is good for health

చాలా మంది తమ శరీరాకృతి అందంగా ఉండటానికి రకరకాల వ్యాయామాలు చెయ్యాలనుకుంటారు, పొద్దున్నే లేచి వ్యాయామం చేద్దాం అనుకుంటారు, కొంత మంది అనుకున్నట్లుగానే చేస్తారు, కానీ ఎక్కువ శాతం బద్ధకం వల్లనో లేక ఏదైనా పని వల్లనో చెయ్యలేకపోతారు. అయితే ఇక నుండి వ్యాయామం చేయలేక పోతున్నామని బాధ పడక్కర్లేదు. వేడి నీటితో స్నానం చేస్తే చాలు, వ్యాయామం చేసిన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వ్యాయామం చేసినప్పుడు శరీరంలో వేడిపుడుతుంది, అదేవిధంగా వేడి నీటితో స్నానం చేసినా శరీరంలో వేడిపుడుతుందని యూకేలోని లుఫ్ బురో యూనివర్సిటీకి చెందిన స్టీవ్ ఫాల్కనర్ చెప్పారు.

2300 మంది మధ్య వయసు వ్యక్తులను సగటున 20 సంవత్సరాలు అధ్యయనం చేశారు. ఇందులో వారంలో ఒక్కసారి వేడినీటి స్నానం చేసే వ్యక్తుల్లో సగం మంది కొంత కాలానికి చనిపోగా, వారంలో రెండు, మూడు సార్లు వేడినీటి స్నానం చేసిన వ్యక్తుల్లో 38 శాతం మందే చనిపోయారు. వేడినీటి స్నానం తరుచూ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి.. రక్తపోటు తగ్గుతుందని, తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని స్టీవ్ అన్నారు. ఎక్కువ సేపు వేడినీటితో స్నానం చేయడం వల్ల 140 కెలరీలు ఖర్చయ్యాయని, ఇది 30 నిమిషాలు వడివడిగా నడవడంతో సమానమని తెలిపారు.అదండీ ఇక నుంచి వేడి నీళ్లతో స్నానం చెయ్యండి.

English summary

Bathing with hot water is good for health