బ్యాటరీ డాక్టర్ తో 50 శాతం ఆదా

Battery Doctor Phone Saver App

04:54 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Battery Doctor Phone Saver App

స్మార్ట్ ఫోన్లను వాడే వారు ఎదుర్కొనే పెద్ద సమస్య బ్యాటరీ బ్యాకప్. ఇంటర్నెట్ వాడినా, గేమ్స్ ఆడినా, ఫొటోలు, వీడియోలు చూసినా బ్యాటరీ ఈజీగా అయిపోతుంది. దీంతో ఎక్కువ మంది యూజర్లు బ్యాటరీ సేవింగ్ యాప్స్ పై ఆధార పడుతున్నారు. వీరి కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక బ్యాటరీ సేవ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా ప్లే స్టోర్‌లోకి వచ్చిన బ్యాటరీ డాక్టర్ - ఫోన్ సేవర్ యాప్ ఇప్పుడు అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. 3.4 ఎంబీ సైజ్ మాత్రమే ఉండే ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ 4.0 ఆపైన వెర్షన్ కలిగిన యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ బ్యాటరీ స్టాండ్‌బై టైంను 50 శాతం వరకు పెంచుతుంది. ఒకే ఒక్క టచ్‌తో ఎక్కువ బ్యాటరీని వినియోగించుకునే యాప్స్‌ను క్లోజ్ చేయవచ్చు. ఫ్రీ, లో పవర్ కన్‌సమ్‌ప్షన్, హైలీ ఎఫిషియంట్, ఇంటెల్లిజెంట్ బ్యాటరీ సేవర్ వంటి ప్రొఫైల్స్ ఇందులో ఉన్నాయి.

English summary

A new app named Battery Doctor to that which saves the battery life upto 50percent of your smart phone