బాటరీ ఎత్తుకుపోయారు-రైళ్లకు బ్రేక్

Battery robbed from train

06:53 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Battery robbed  from train

ఎవరైనా మనసు దోచారనో, ఇంట్లో సామాన్లు చోరీ చేసారనో వింటూంటాం. కానీ ఇక్కడ ఏకంగా రైల్వే స్టేషన్ లో బాటరీ బాక్స్ ఎత్తుకుపోయారు. ఇది ఎక్కడో మారుమూల కాదు ముంబాయి మహానగరంలో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో జరిగిన ఓ దొంగతనం కారణంగా ముంబై వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంబయిలోని దాదర్ రైల్వే స్టేషన్ లో ఈరోజు బ్యాటరీ బాక్స్ ను దొంగలెత్తుకుపోవడంతో చాలా సేపు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో నగరంలో లక్షలాది మంది ప్రయాణికులు స్టేషన్లలో నిలిచిపోయారు. పశ్చిమ రైల్వేకు ఇది భారీ వైఫల్యం.

దాదర్ స్టేషన్ లో సమస్య కారణంగా ముంబయిలోని పలు స్టేషన్లలో రైళ్లను నిలిపేసినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాటరీ బాక్స్ దొంగిలించడంతో అంధేరి- చర్చ్ గేట్ మధ్య విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అంధేరి-వైరా సెక్షన్ లో దాదాపు అరగంట పాటు సర్వీసులు నిలిచిపోయాయి. లక్షలాది మంది సమయానికి ఉద్యోగాలకు వెళ్లలేక స్టేషన్లలో నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. తర్వాత సమస్యను సరిదిద్ది తిరిగి రైలు సర్వీసులు పునరుద్ధరించారు. దొంగలు పట్టుకుపోడానికి అది ఇదీ అనే తేడా లేదని దీంతో మరోసారి తేలింది.

English summary

Battery robbed from train