బావర్చి హోటల్ ను సీజ్ చేసిన అధికారులు!

Bawarchi hotel was seized by municipal commissioner

05:40 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Bawarchi hotel was seized by municipal commissioner

చికెన్ బిర్యాని అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యాని అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి ఉంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరైనా సరే హైదరాబాద్ బిర్యానిని లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అయితే ఇంత ఫేమస్ బిర్యానిని ఎంత పరిశుభ్రంగా తయారు చేస్చున్నారన్నదే ప్రశ్నార్ధకం. హైదరాబాద్ ఉప్పల్ లో ఉన్న బావర్చి హోటల్ పై మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, కొంత మంది శానిటరీ అధికారులు కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. హోటల్ పరిస్థితిని గమనించిన మునిసిపల్ సిబ్బంది దాన్ని సీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.

వెంటనే అనుకున్నది చేశారు. బావర్చి హోటల్ వెనుక వైపు గల మ్యాన్ హోల్ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.నిన్న అర్దరాత్రి మున్సిపల్ కమిషనర్, శానిటరీ అధికారులు బావర్చి హోటల్ వెనుక ఉన్న మ్యాన్ హోల్ ను పరిశీలించగా మురుగునీరు, చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. అధికారులు ఆ హోటల్ కిచెన్ ను పరిశీలించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో కుళ్లిపోయిన చెత్తాచెదారం ఉంది. దోమలు, ఈగలు ఎగురుతున్నాయి. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వండిని ఆహార పదార్థాలు తింటే ప్రజలు అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన అధికారులు హోటల్ ను సీజ్ చేశారు.

English summary

Bawarchi hotel was seized by municipal commissioner