బీబీసీ వెబ్ సైట్ హ్యాక్

BBC website Hacked

11:17 AM ON 4th January, 2016 By Mirchi Vilas

BBC website Hacked

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పనిచేసే ఓ హ్యాకర్స్ గ్రూప్.. బీబీసీ నెట్ వర్క్ వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. కొత్త ఏడాదికి ముందు రోజు గురువారం కొన్ని గంటల పాటు బీబీసీ వెబ్ సైట్లు పనిచేయలేదు. అయితే ఈ వార్త పై బీబీసీ యాజమాన్యం స్పందించలేదు. హ్యాకర్లు దాడి చేసిన విషయన్ని ధ్రువీకరించడం కానీ తోసిపుచ్చడం కానీ చేయలేదు. అయితే ఈ సమయంలో వెబ్ సైట్ పనిచేయలేదని మాత్రం తన సైట్ లో నిర్ధారించింది. కాగా ఐఎస్ సభ్యులు, అనుబంధ వెబ్ సైట్లను హ్యాక్ చేస్తుంటామని హ్యాకర్స్ గ్రూప్ వెల్లడించింది. తమ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు బీబీసీ వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్టు హ్యాకర్స్ గ్రూప్ పేర్కొంది.

English summary

A Hackers group has hacked all the BBC websites.All the BBC's websites were unavailable for several hours on New Year's Eve after what a BBC source described as a "distributed denial of service" attack.